business

మనం రోజు చూసే ఈ 10 కంపెనీల లోగోల గురించి మీకు తెలుసా..? వాటిలో దాగున్న అర్ధాలు ఇవే..!

నిత్యం మనం అనేక ప్రదేశాల్లో అనేక కంపెనీలకు చెందిన లోగోలను చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని సాదా సీదాగా ఉంటే కొన్ని మన చూపును ఇట్టే ఆకర్షిస్తాయి. అవును మరి, కంపెనీల ప్రమోషన్‌ లో లోగోలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఆ లోగోలు ఆయా కంపెనీలకు చాలా పేరు తెచ్చి పెడతాయి. ఇక ప్రముఖ కంపెనీలు అయితే ప్రత్యేక అర్థాలు వచ్చేలా లోగోలను తయారు చేస్తాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది సరిగ్గా అలాంటి కొన్ని కంపెనీల గురించే. మరి ఆయా కంపెనీల లోగోలకు ఉన్న అర్థాలు ఏమిటో, వాటిని అలా ఎందుకు తయారు చేయించాయో ఇప్పుడు తెలుసుకుందామా. ప్రస్తుతం స్టార్‌ బక్స్‌ కాఫీకి ఉండే ఆకుపచ్చని లోగోను మీరు చూశారు కదా. అయితే అది నిజానికి ఒక మత్స్యకన్య (మర్మెయిడ్‌) బొమ్మ. 1971 లలో పూర్తి మర్మెయిడ్‌ తన రెండు తోకలను ఎత్తి పట్టుకున్నట్టుగా ఆ లోగో ఉండేది. అయితే అది కొంత అభ్యంతరకరంగా ఉండడంతో దాన్ని సెన్సార్‌ చేసి ఆకుపచ్చని లోగోను తయారు చేశారు. అప్పటి నుంచి అదే లోగోను వాడుతున్నారు.

నైకి లోగోలో కింద రైట్‌ పెట్టినట్టుగా మార్క్‌ ఉంటుంది కదా. అయితే దాన్ని ఓ స్టూడెంట్‌ తయారు చేశాడు. అతని పేరు కరోలిన్‌ డేవిడ్‌సన్‌. గాడెస్‌ ఆఫ్‌ విక్టరీ అనే బొమ్మలో ఉన్న రెక్కలను దృష్టిలోకి తీసుకుని అతను అలా రైట్‌ మార్క్‌ వచ్చేలా నైకి లోగోను తయారు చేశాడు. అయితే అలా తయారు చేసినందుకు అతనికి లభించిన మొత్తం కేవలం 35 డాలర్లు మాత్రమే. అయినప్పటికీ ఆ తరువాత నైకి బ్రాండ్‌ పాపులర్‌ అవడంతో అతను పెద్ద మొత్తంలో డబ్బులను సంపాదించాడు. యాపిల్‌ కంపెనీ లోగోను మొదట పూర్తి స్థాయి యాపిల్ బొమ్మ వచ్చేలా తయారు చేశారు. కానీ అది టమాటానా, నారింజా లేదా వేరే ఇతర పండా ? అనే సందేహాలు చాలా మందికి వచ్చాయట. దాన్ని యాపిల్ పోల్చుకోలేకపోయారట. కనుక డిజైనర్‌ రాబ్‌ జనోఫ్‌ యాపిల్‌ ను కొంత కొరికినట్టుగా ఉండేలా డిజైన్‌ చేశారు. దీంతో యాపిల్‌ లోగో అప్పటి నుంచి అలాగే ఉంది.

do you know the meaning of these 10 logos do you know the meaning of these 10 logos

మెట్రో గోల్డ్‌ విన్‌ మేయర్‌ నిర్మాణ సంస్థకు చెందిన సినిమా వస్తే ముందుగా ఓ సింహం గర్జించినట్టుగా లోగోలో దర్శనమిస్తుంది కదా. అయితే అలా సింహం గాండ్రించేలా చేసేందుకు వాటికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు. అంతేకానీ చిత్రంలో ఉన్నట్టుగా వాటిని ఎంఆర్‌ఐలోకి పంపలేదు. అది ఒక ఫేక్‌ ఫొటో. నిజానికి సింహాలకు ట్రెయినింగ్‌ ఇచ్చాకే వాటి గాండ్రింపును రికార్డ్‌ చేశారు. అనంతరం దాన్ని లోగోలా మార్చారు. ఫెరారీ కార్లపై ఉండే గుర్రపు బొమ్మ లోగో ఎలా వచ్చిందంటే… ఎంజో ఫెర్రారీ అనే వ్యక్తి రేస్‌లో గెలుపొందినందుకు గాను ఫ్రాన్సెస్కో అనే వ్యక్తి తల్లి ఎంజోకు ఆ గుర్రపు బొమ్మ పెయింటింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందట. దీంతో అప్పటి నుంచి ఫెరారీ కి ఆ లోగో వచ్చింది. బవేరియన్‌ జెండా కలర్స్‌ ఆధారంగా బీఎండబ్ల్యూ లోగోను తయారు చేశారు. వాటిలో కొన్ని తెలుపు, కొన్ని బ్లూ కలర్‌ బాక్స్‌లు ఉంటాయి. అందుకు తగినట్టుగానే ఆ లోగోను క్రియేట్‌ చేశారు.

మెక్‌ డొనాల్డ్స్ కంపెనీ లోగోలో ఉండేది ఆంగ్ల M అక్షరం అనుకుంటారు. కానీ అది కాదు. నిజానికి అది మహిళల వక్షోజాలను సూచిస్తుంది. అంటే వారి వక్షోజాల లాగే ఆ కంపెనీ బ్రెడ్స్‌ కూడా మృదువుగా ఉంటాయని అర్థం వచ్చేలా వారు M అక్షరాన్ని అలా మార్చారు. 1962లో ఈ లోగోను క్రియేట్‌ చేశారు. అప్పటి నుంచి అది చెలామణీలో ఉంది. సాధారణంగా గ్లోబ్‌ సింబల్‌ అంటే ప్రపంచం మొత్తం అని అర్థం వస్తుంది కదా. అలాగే వికీపీడియా అంటే మొత్తం విజ్ఞానానికి సూచిక అన్నట్టుగా ఆ లోగోను గుండ్రంగా తయారు చేశారు. ఇక ప్రపంచం అంటే అన్ని భాషలూ ఉంటాయి కదా, కనుక ఆ సైట్‌లో జ్ఞానం అన్ని భాషల్లోనూ లభిస్తుందని అర్థం. ఇక దానిపై ఒక పీస్‌ ఎందుకు మిస్‌ అయిందంటే… వికీపీడియాలో మనకు ఎన్ని విషయాలు దొరికినప్పటికీ అది పూర్తిగా కాదు, ఎంతో కొంత పెండింగ్‌ సబ్జెక్ట్‌ ఉంటుంది. కనుక దాన్ని తెలియజేసేందుకే అలా ఆ లోగోను తయారు చేశారు.

ఊబర్‌ కంపెనీ లోగో మొదట అణువును సూచించే బొమ్మగా ఉండేది. అందుకు కారణం ఏమిటంటే… అణువు అన్ని చోట్లా ఉన్నట్టే తమ కంపెనీకి చెందిన కార్లు కూడా అన్ని చోట్లా ఉంటాయని అర్థం. అయితే దాన్ని యూ అర్థం వచ్చేలా తరువాత మార్చారు. ఆండ్రాయిడ్‌ లోగో తయారీ వెనుక చాలా ఫన్నీ కాన్సెప్ట్‌ ఉంది. అదేమిటంటే.. పబ్లిక్‌ బాత్‌రూంలపై మెన్‌, వుమెన్‌ సింబల్ ఉంటుంది కదా, దాన్ని చూసి ఆండ్రాయిడ్‌ లోగోను తయారు చేశారు. ఆండ్రాయిడ్‌ అంటే మనిషి రూపంలో ఉన్న రోబో అని అర్థం వస్తుంది. ఆ మనిషి ఆడ లేదా మగ ఎవరైనా కావచ్చు, కనుక ఇద్దరినీ ప్రతిబింబించే విధంగా ఉంటుందని ఆండ్రాయిడ్‌ లోగోను అలా తయారు చేశారు. అప్పటి నుంచి అదే పాపులర్‌ అయింది.

Admin

Recent Posts