ఆధ్యాత్మికం

Garuda Puranam : గరుడ పురాణం ప్రకారం.. అలాంటి వారి ఇళ్లలో అస్సలు అన్నం తినరాదు.. ఎందుకో తెలుసా..?

Garuda Puranam : గరుడ పురాణం గురించి అందరికీ తెలిసిందే. మనుషులు చేసే పాపాలకు నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో అందులో స్పష్టంగా చెప్పబడింది. గరుడ పురాణాన్ని వేద వ్యాసుడు రచించగా అందులో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. సమాజంలో మనుషులు తమ తోటి వారి పట్ల ఎలా మెలగాలి ? అనే అంశాలను ఈ పురాణంలో వివరించారు.

ఇక గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వారి ఇళ్లలో అన్నం తినకూడదో కూడా వివరించారు. ఒక నేరస్థుడు లేదా దొంగ ఇంట్లో అన్నం తినరాదు. ఎందుకంటే వారు ఎన్నో నేరాలు లేదా దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో అన్నం పెడతారు. అలాంటి అన్నాన్ని తింటే వారి పాపాలు మనకు చుట్టుకుంటాయి. కనుక అలాంటి వారి ఇళ్లలో అస్సలు అన్నం తినరాదు.

according to garuda puranam you should not take food from this type of people

మోసం చేసే గుణం ఉన్న స్త్రీ ఇంట్లో లేదా వ్యభిచారం చేసే స్త్రీ ఇంట్లో కూడా అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది.

వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజల రక్త మాంసాలను వడ్డీలుగా వసూలు చేసే వ్యాపారస్తుల ఇంట్లోనూ అన్నం తినరాదు. విపరీతమైన కోపం ఉన్నవారు, నీచపు గుణాలు ఉండే వ్యక్తులు, ఒకరి మీద చాడీలు చెప్పే వారి ఇండ్లలోనూ అన్నం తినరాదు.

ఇక పేద వారి ఇంట్లోనూ అన్నం తినరాదని గరుడ పురాణం చెబుతోంది. ఎందుకంటే.. పేదలకు సహజంగానే ఆహారానికి కొరత ఉంటుంది. అలాంటి వారికి చేతనైతే ఆహారం పెట్టాలి. కానీ వారి దగ్గర ఉన్నది తినరాదు. తింటే పాపం తగులుతుంది. అదే వారికి ఆహారం పెడితే పుణ్యం లభిస్తుంది. కనుక గరుడ పురాణం ప్రకారం ఆ విధంగా చేయాల్సి ఉంటుంది.

Admin

Recent Posts