ఆధ్యాత్మికం

Bedi Anjaneya Swamy Temple : తిరుమ‌ల‌లో ఉన్న ఈ హ‌నుమాన్ ఆల‌యం గురించి మీకు తెలుసా..?

Bedi Anjaneya Swamy Temple : తిరుమల సన్నిధి వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆంజనేయస్వామిని బేడీలతో బంధించారు. అయితే చాలామంది తిరుమల ఎన్నోసార్లు వెళ్లి ఉంటారు. కానీ ఈ బేడి ఆంజనేయస్వామి గురించి తెలియకపోయి ఉండొచ్చు. మరి ఈ ఆంజనేయస్వామిని ఎందుకు బేడీలతో బంధించారు, కారణం ఏంటి.. వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడికి కూడా నైవేద్యాన్ని తీసుకువస్తారు. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే హనుమంతుడు చిన్నతనంలో ఒంటెను వెతకడానికి తిరుమలని విడిచి పెట్టాలని అనుకుంటాడు. అతని తల్లి అంజనాదేవి ఆయ‌న‌ మణికట్టుకి బేడీలతో కట్టి ఆమె తిరిగి వచ్చేదాకా ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అంజనాదేవి ఆకాశగంగ‌ ప్రాంతంలో ఉండిపోయింది. తిరిగి రాలేద‌ని పురాణాల ప్రకారం తెలుస్తోంది.

Bedi Anjaneya Swamy Temple in tirumala do you know about it

ఈ ఆలయంలోని హనుమంతుని రెండు చేతులకి సంకెళ్లు వుంటాయి. ఇలా ఒక ప్రత్యేక ఆకృతిలో ఈ హనుమంతుడు వుంటాడు. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కష్టాలని, కోరికల్ని చెప్పుకుంటే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయ‌ని భక్తుల నమ్మకం. ఇప్పటికీ ఆ ఆంజనేయస్వామి అక్కడే స్థిరపడి ఉన్నట్లు వైష్ణవ సంప్రదాయాల ప్రకారం ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడగా ఈయన వెలసినట్లు తెలుస్తోంది.

తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయస్వామి.. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా కనిపిస్తాడు. ప్రతి ఆదివారం కూడా శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అభిషేకాలని కూడా నిర్వహిస్తారు. ఈ బేడి ఆంజనేయస్వామి ఆలయంలో కూడా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుతారు. తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని మీరు చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. నడిచి వెళ్ళిపోవచ్చు. ఆలయం అఖిలాండం పక్కనే ఉంది. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి రాత్రి 9 వరకు కూడా ఈ ఆలయం తెరచి ఉంటుంది.

Admin

Recent Posts