Pregnant Women : గర్భిణీలు పూజలు చేయొచ్చా లేదా అని సందేహం చాలా మందిలో ఉంటుంది. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని పండుగలు, పర్వదినాల్లో పూజలు చేయాలని చాలా మంది గర్భిణీలు అనుకుంటూ ఉంటారు. కానీ పెద్దలు పూజలు చేయకూడదని చెప్తూ ఉంటారు. మరి నిజంగా పూజలు చేయొచ్చా..? పూజలు చేయకూడదా..? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీలు తేలికపాటి పూజలు చేయొచ్చు. కానీ కొబ్బరికాయని అస్సలు కొట్టకూడదు.
అలానే కొత్త పూజా విధానాల్ని ప్రారంభించడం కూడా మంచిది కాదు. గర్భిణీలు దేవాలయాలకు వెళ్లడం కూడా మంచిది కాదు. కోటి స్తోత్రాలు చదవడం కంటే ఒకసారి జపం చేసుకుంటే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. ఉత్తమమైన ఫలితాలని అందుకోవచ్చు. కాబట్టి గర్భవతులు ధ్యానం చేయడం మంచిది. స్తోత్రాలు చదవడం, కఠినమైన పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం వంటివి చేయకూడదు. ఈ నియమాలని పెట్టడానికి కారణం వారి క్షేమం కోసమే.
వాళ్లు క్షేమంగా ఉండాలని, కడుపులో బిడ్డ దుఃఖ పడకూడదని ఇటువంటి నియమాలని పెద్దలు పెట్టారు. పూజ అని ఎక్కువసేపు నేల మీద కూర్చోవడం వంటివి చేయడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. అనవసరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. పైగా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలంటే ఎక్కువ మెట్లు ఎక్కాలి. అలానే చాలా వరకు ఆలయాలు కొండల మీదే ఉంటాయి.
భక్తులు కూడా దేవాలయాల్లో ఎక్కువగా ఉంటారు. ఇటువంటప్పుడు గర్భిణీలకు మంచిది కాదు. ఇబ్బంది పడాలని, కష్టపడాలని ఈ నియమాలని పెద్దలు పెట్టారు. దీనికి బదులు కాసేపు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది. కాబట్టి గర్భిణీలు ఇలా పూజలు చేయడం కంటే కూడా కాసేపు ధ్యానం చేసుకోవడమే శ్రేయస్కరం.