ఆధ్యాత్మికం

ఏ నూనెతో దీపారాధన చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

మన హిందూ ఆచారం ప్రకారం దేవుడు ముందు దీపం వెలిగించి పూజ చేయడం ఒక ఆచారం.ఈ విధంగా దేవుని చిత్రపటం ముందు లేదా విగ్రహం ముందు దీపం వెలిగించడం వల్ల మన చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి మన జీవితంలో వెలుగులు నిండుతాయని భావిస్తాము. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో విధమైన నూనెను ఉపయోగిస్తుంటారు. మరి ఏ నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

దీపారాధన కోసం ఆవు నెయ్యి, విప్ప, వేప నూనెను ఉపయోగించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేయటం వల్ల శని బాధలు తొలగిపోతాయి. ఆవు నెయ్యి, ఆముదం, కొబ్బరి నూనె, విప్ప, వేప నూనెల మిశ్రమాన్ని ఉపయోగించి నలభై ఒక్క రోజుల పాటు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

deeparadhana with which oil gives which benefits

శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవునెయ్యితో దీపారాధన చేయడం ఎంతో శుభకరం. అదేవిధంగా మన జీవితంలో ఏర్పడిన విఘ్నాలు తొలగిపోవాలంటే వినాయకుడికి నల్లనువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఎంతో మంచిది. ఈ విధంగా దీపారాధన చేస్తున్నప్పుడు ఎటువంటి ఆధారం లేకుండా ప్రమిదను కింద పెట్టకూడదు. ప్రమిద కింద ఆకును ఉంచి దీపం పెట్టాలని పండితులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts