ఆధ్యాత్మికం

Pasupu Gavvalu : పసుపు గవ్వలతో ఇలా చేస్తే చాలు.. డబ్బే డబ్బు.. అన్ని సమస్యల నుంచి బయట పడతారు..!

Pasupu Gavvalu : చిన్నతనంలో చాలా మంది అష్టాచెమ్మా, పచ్చీస్‌ వంటివి ఆడి ఉంటారు. ఇప్పటికీ పలు చోట్ల వీటిని ఆడుతూనే ఉంటారు. అయితే వీటిని ఆడేందుకు చాలా మంది గవ్వలను ఉపయోగిస్తారు. మొత్తం ఏడు గవ్వలను అందుకు వాడుతారు. అయితే వాస్తవానికి గవ్వల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో పసుపు రంగు గవ్వలు కూడా ఒకటి. వీటికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో కింద చెప్పిన విధంగా పలు పరిహారాలను చేస్తే చాలు.. దాంతో ఎలాంటి సమస్య నుంచి అయినా సరే బయట పడతారు. అలాగే ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇక వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

సముద్రం ఒడ్డున దొరికే గవ్వల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని గవ్వలను వైకుంఠపాళి, అష్టాచెమ్మా వంటి ఆటల్లో ఉపయోగిస్తారు. అయితే పసుపు రంగు గవ్వలు మనకు ఆధ్యాత్మిక పరంగా ఉపయోగపడతాయి. వీటితో బగళాముఖి మాతను ఆరాధిస్తే శత్రుపీడ తొలగిపోతుంది. ఈ గవ్వలు కాస్త చిన్నగా ఉంటాయి. సులభంగా గుర్తు పట్టవచ్చు. లేత పసుపు రంగులో మనకు దర్శనమిస్తాయి. ఈ గవ్వలను పూజ మందిరంలో ఉంచి పూజలు చేయడం, ధూపదీపాలను సమర్పించడం చేస్తే జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే రాహు కేతు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

do like this with pasupu gavvalu to get rid of economical problems

ఎలాంటి పూజల్లో అయినా సరే ఈ పసుపు గవ్వలను ఉపయోగించవచ్చు. కానీ బేసి సంఖ్యలో ఉపయోగించాలి. దీంతో అనుకున్నవి నెరవేరుతాయి. కార్యసిద్ధి జరుగుతుంది. అన్నింటా విజయం సాధించారు. డబ్బు బాగా సంపాదిస్తారు. అలాగే 11 పసుపు రంగు గవ్వలను పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి శుక్రవారం రోజు పూజించి ఆ గవ్వల మూటను డబ్బు దాచుకునే చోట ఉంచాలి. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. అప్పులు తీరిపోతాయి. డబ్బు బాగా సంపాదిస్తారు. ఇలా పసుపు రంగు గవ్వలతో మనం ప్రయోజనాలను పొందవచ్చు.

Admin

Recent Posts