ఆధ్యాత్మికం

దీపారాధ‌న చేసే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్లు చేయ‌కండి..!

కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన మాసం అని అంద‌రికీ తెలిసిందే. ఈ మాసంలో శివారాధ‌న చేస్తే ఎన్నో జ‌న్మ‌ల పుణ్య ఫ‌లం ల‌భిస్తుంది. అలాగే మ‌హాశివ‌రాత్రి రోజు శివుడికి పూజ‌లు చేసినా ఎంతో పుణ్యం ల‌భిస్తుంది. అయితే శివారాధ‌న‌లో దీపారాధ‌న‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంటుంది. కొంద‌రు భ‌క్తులు ప్ర‌తి సోమ‌వారం దీపారాధ‌న చేస్తారు. ఇక కేవ‌లం శివుడికే కాకుండా ఇత‌ర దేవ‌త‌ల‌కు కూడా కొంద‌రు వారం వారం దీపారాధ‌న చేస్తుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో లాభం క‌లుగుతుంది. అయితే దీపారాధ‌న చేసేట‌ప్పుడు కొంద‌రు తెలియ‌కుండానే పొర‌పాట్లు చేస్తుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎట్టి ప‌రిస్థితిలోనూ స్టీల్ కుందులో దీపారాధ‌న చేయ‌రాదు. ఇత‌ర ప‌దార్థాల‌తో చేసిన కుందుల‌నే దీపారాధ‌న‌కు ఉప‌యోగించాలి. మ‌ట్టితో చేసిన‌వి అయితే ఇంకా శ్రేష్ట‌మైన‌వి. అలాగే అగ్గిపుల్ల‌తో దీపాన్ని వెలిగించ‌రాదు. అదేవిధంగా ఒక వ‌త్తితో దీపాన్ని చేయ‌రాదు. ఏక‌వ‌త్తి దీపాన్ని శ‌వం వ‌ద్ద వెలిగిస్తారు. క‌నుక ఈ పొర‌పాటు అస‌లు చేయ‌రాదు. ఇక దీపాన్ని అగ‌ర్ బ‌త్తితో వెలిగించాల్సి ఉంటుంది.

do not do these mistakes while doing deeparadhana

దీపారాధ‌న చేసే స‌మ‌యంలో కుందుకి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షిత‌లు వేయాలి. అలాగే విష్ణువుకు అయితే కుడి వైపు దీపాన్ని ఉంచాలి. ఎదురుగా దీపాన్ని పెట్ట‌రాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం న‌మఃశివాయ అని జ‌పించి ఆ త‌రువాతే దీపం వెలిగించాలి. ఇలా దీపారాధ‌నలో ఈ నియ‌మాల‌ను త‌ప్ప‌కుండా పాటించాలి. లేదంటే దీపారాధ‌న చేసిన ఫ‌లితం కూడా రాదు. కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ నియ‌మాల‌ను గుర్తుంచుకుని మ‌రీ పాటించాల్సి ఉంటుంది.

Admin

Recent Posts