హెల్త్ టిప్స్

Immunity Power : మీలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఎంత ఉంది.. ఇలా చెక్ చేయండి..!

Immunity Power : సాధారణంగా మనం తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము.అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉండటం వల్ల ఇలాంటి అంటువ్యాధుల నుండి తొందరగా ఉపశమనం పొందుతారు. వ్యాధికారక బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగనిరోధక శక్తి ప్రభావం వాటిపై చూపించి వ్యాధి నుంచి మనకి విముక్తిని కల్పిస్తుంది. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి పని చేస్తుందో లేదో మనకు తెలియదు. కానీ ఈ లక్షణాలు కనుక మనలో కనిపిస్తే మన శరీరంలో రోగనిరోధక శక్తి పని చేస్తుందో.. లేదో.. తెలుసుకోవచ్చు.

సాధారణంగా మనకు దోమలు కుట్టినప్పుడు మన చర్మం ఎర్రగా కందిపోతుంది. ఎవరికైతే ఇలా ఎర్రగా దద్దుర్లు ఏర్పడి కందిపోయి ఉంటాయో అలాంటి వారిలో రోగనిరోధక శక్తి పనితీరు మెరుగ్గా ఉంటుందని అర్థం. అదేవిధంగా కొందరికి బ్యాక్టీరియా, ఇతర క్రిములు సోకకుండా ముందుగానే జలుబు చేస్తుంది. ఇలా జలుబు చేయటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పని చేస్తుందని చెప్పవచ్చు.

how to check immunity power in you do like this

చాలామందికి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరగవు ఈ విధంగా మార్పులు జరగకపోతే వారి శరీరంలో రోగనిరోధకశక్తి పనిచేయలేదని అర్థం. అలాగే రోగనిరోధక శక్తి పనిచేయని వారిలో జలుబు రాదు.ఈ క్రమంలోనే మన శరీరంలో రోగనిరోధకశక్తి సరైన క్రమంలో పనిచేయాలంటే తప్పనిసరిగా మనం తీసుకునే ఆహారం పోషక విలువల తో నిండి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts