ఆధ్యాత్మికం

Tuesday Works : మంగ‌ళ‌వారం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కండి.. ఇవి చేయండి..!

Tuesday Works : మంగళవారం కొన్ని పనులు చేయాలి. అలానే, కొన్ని పనులు చేయకూడదు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిద్రపుత్రుడు. కుజ గ్రహం, భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. అయితే, భూమి మీద నివసించే వాళ్లకి కుజగ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కుజుడు కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకి కారకుడు. అందుకనే ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుందని, మంగళవారం నాడు శుభకార్యాలు ఎక్కువగా తలపెట్టరు. ఈ రోజున గోళ్లు కత్తిరించుకోవడం, క్షవరం మొదలైనవి అస్సలు చేయకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే, అంత మంచిది. అలానే, మంగళవారం నాడు అప్పు ఇస్తే, ఆ డబ్బు మళ్ళీ వెనక్కి రాదు. ఎంతో కష్టంగా డబ్బులు వస్తాయి.

అప్పు తీసుకున్నట్లయితే, అది అనేక బాధలకి కారణం అవుతుంది. దైవ కార్యాలయం, విద్యా, వైద్య పరమైన రుణాలకి మాత్రం ఈ నియమం వర్తించదని గుర్తుపెట్టుకోండి. మంగళవారంనాడు, కొత్త బట్టల్ని వేసుకోకూడదు. తల స్నానం కూడా మంగళవారంనాడు చేయకూడదు. ముఖ్యమైన ప్రయాణాలు ఏమైనా చేయవలసి వస్తే, భగవంతుడుని ధ్యానించి, ప్రయాణాన్ని మొదలు పెట్టాలి.

do not do these works on tuesday

మంగళవారం ఉపవాసం చేసినట్లయితే, రాత్రి పూట ఉప్పు వేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. మంగళవారం నాడు, ఆంజనేయస్వామిని పూజిస్తే ధైర్యం వస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం వలన, కుజగ్రహ ప్రభావం కారణంగా, కలిగే ప్రమాదాలు తగ్గుతాయి. మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన, శత్రువులపై జయం కలుగుతుంది.

మంగళవారం నాడు, కుజునికి ఇష్టమైన ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టమైన దైవాన్ని పూజించడం వలన, ఎంతో మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్రదృష్టితో చూస్తే,, ఎరుపు వస్త్రాలు ధరించకూడదు. హనుమంతుడిని సింధూరంతో పూజించడం వలన దోష ప్రభావం తగ్గుతుంది. సుబ్రహ్మణ్యస్వామికి 11 ప్రదిక్షణలు చేస్తే కూడా దోష ప్రభావం తగ్గుతుంది.

Admin

Recent Posts