ఆధ్యాత్మికం

శుక్రవారం తులసి మొక్కను ఇలా పూజిస్తే.. కష్టాలు దూరమవుతాయి..

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క దర్శనమిస్తుంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే శుక్రవారం పూట తులసి మొక్కను పచ్చి పాలతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాపార రంగంలో స్థిరపడిన వారు కొన్నిసార్లు వ్యాపారంలో తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా వ్యాపారంలో అధిక నష్టాలను ఎదుర్కొనేవారు తులసి మొక్కకు శుక్రవారం సాయంత్రం పచ్చి పాలు, స్వీట్లతో పూజ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల క్రమక్రమంగా వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఇలా తులసి మొక్కకు నైవేద్యంగా సమర్పించిన పాలు, స్వీట్లు మిగిలితే వాటిని వివాహిత స్త్రీకి దానం చేయడం వల్ల శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

do pooja to tulsi plant on friday like this for wealth

వ్యాపార రంగంలో నష్టాలు వాటిల్లకుండా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అలాగే మన ఇంట్లో ఎవరైనా సమస్యలతో సతమతమవుతున్నప్పుడు ఒక ఐదు తులసి ఆకులను ఇత్తడి నీటి కుండలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకుని ఇంటి లోపల, బయట శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Admin

Recent Posts