ఆధ్యాత్మికం

Lakshmi Devi : ల‌క్ష్మీ క‌టాక్షం పొందేందుకు ఏ రాశి వారు ఏం మంత్రం జ‌పించాలంటే..?

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ధనవంతుల అవ్వాలని, లక్ష్మీదేవి కటాక్షం లభించాలని అనుకుంటారు. లక్ష్మీ కటాక్షం పొందాలంటే, ఏ రాశి వాళ్ళు ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది అనేది ఈరోజు చూద్దాం. అలానే, శుక్రవారం నాడు మహిళలు ఎరుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ బట్టలు కానీ వేసుకుని కాళ్లు, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీ దేవిని ఆరాధిస్తే, లక్ష్మీదేవి ఆ ఇంట సిరిసంపదలు కలిగేలా చేస్తుంది. ఐశ్వర్యం ని ఇస్తుంది.

ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉండాలని, సిరిసంపదలు కలగాలని ఉంటుంది. తల్లి అనుగ్రహం ఉన్నంత వరకు ఇంట్లో ఏ లోటు ఉండదు. ఎలాంటి ఇబ్బంది రాదు. ఖర్చులు, అప్పులు బాధలు ఇలా ఎన్నో సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక ఏ రాశిలో వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

which zodiac sign person should read which mantra

మేష రాశి వాళ్లు ఓం క్లీం సో అనే మంత్రాన్ని జపించాలి. వృషభ రాశి వారు ఓం క్లీం శ్రీం అని జపించాలి. మిధున రాశి వాళ్లు ఓం క్లీం ఏం సో. కర్కాటక రాశి వారు ఓం ఏం క్లీం శ్రీ, సింహ రాశి వారు ఓం హ్రీం ఏం సో, కన్యా రాశి వారు ఓం శ్రీమ్ ఏం సో, తులా రాశి వారు ఓం హ్రీం క్లీం శ్రీం, వృశ్చిక రాశి వారు ఓం ఏం క్లీం సో, ధనస్సు రాశి వారు ఓం హ్రీం క్లీం సో, మకర రాశి వారు ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సో, కుంభ రాశి వారు ఓం హ్రీం ఏం క్లీం శ్రీం, మీన రాశి వారు ఓం హ్రీం క్లీం సో అని జపిస్తే, లక్ష్మీ దేవి ఆ ఇంట ఉంటుంది.

Admin

Recent Posts