ఆధ్యాత్మికం

పూట‌పూట‌కీ క‌దిలే శివ‌లింగం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడు దేవుడు&period; ఆయన దేవుడు కాబట్టి ఆయన్ను పూజిస్తాం&period; కానీ&period;&period; ఇతర దేవుళ్లను పూజించినట్టే ఆయన్ను పూజిస్తామా&quest; అంటే అస్సలు కాదు&period; ఇతర దేవుళ్లకు వాళ్ల ప్రతిరూపాలు ఉంటాయి&period; కానీ&period;&period; శివుడికి ప్రతిరూపం ఉండదు&period; కేవలం శివలింగం మాత్రమే ఉంటుంది&period; మీరు ఏ శివుడి గుడికి వెళ్లినా అక్కడ శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది తప్పితే శివుడి రూపం మాత్రం కనిపించదు&period; అసలు శివలింగం అంటే ఏంటి&period; శివం అంటే శుభప్రదం అని అర్థం&period; లింగం అంటే సంకేతం&period; మీరు ఎక్కడ చూసినా శివలింగాలు దాదాపుగా నల్లరాతి రూపంలోనే ఉంటాయి&period; శివుడిని పూజించాలంటే శివలింగాన్ని పూజించాలి&period; శివలింగానికి పూజిస్తే శివుడికి పూజలు సమర్పించినట్టే&period; సరే&period;&period; ప్రపంచంలో మీరు ఎన్నో శివలింగాలను చూసి ఉంటారు&period; కానీ… ఈ శివలింగాన్ని మాత్రం అస్సలు చూసి ఉండరు&period; ఎందుకంటే ఇది ప్రత్యేకమైన శివలింగం&period; దీనికి ఉన్న పేరు ఏంటో తెలుసా&quest; కదిలే శివలింగం దీని పేరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కదిలే శివలింగం… ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపూర్ అనే గ్రామంలో ఉంది&period; ఈ శివలింగాన్ని దుగ్దేశ్వర్నాథ్ అని కూడా పిలుస్తారు&period; నిజానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది&period; దానికి ఇది ఉపలింగమట&period; ఇక&period;&period; దీని ప్రత్యేకత కదలడం&period; ఈ శివలింగం కదులుతూ ఉంటుంది&period; అయితే మనుషులు చేతితో ఎంత కదిపినా కదలని శివలింగం&period;&period; దానికదే కదలడంతో దీనికి చాలా మహత్తు ఉందని భక్తులు నమ్ముతారు&period; ఈ శివలింగానికి 2000 ఏళ్ల చరిత్ర ఉందట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78772 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;dugdheshwar-nath-mandir&period;jpg" alt&equals;"dugdheshwar nath mandir and its facts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&period;&period; ఇది ఎప్పుడు కదిలేదు మాత్రం తెలియదు&period; ఈ శివలింగం కదులుతుండగా పూజారులు చాలాసార్లు చూశారట&period; శివలింగం కదులుతోందని అక్కడ వార్త వ్యాపిస్తే చాలు&period;&period; ప్రజలంతా తండోపతండాలుగా వెళ్లి కదులుతున్న శివలింగాన్ని దర్శించుకొని వస్తారట&period; అలా ఈ కదిలే శివలింగం ఉత్తర్ ప్రదేశ్ లో తెగ ఫేమస్ అయిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts