ఆధ్యాత్మికం

ఈ సూచ‌న‌లు పాటిస్తే ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోయి డ‌బ్బు బాగా స‌మ‌కూరుతుంది..

డ‌బ్బు… అది ఉంటేనే నేటి త‌రుణంలో ఏదైనా సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుత స‌మాజంలో డ‌బ్బుతో సాధ్యం కానిదేదీలేదు. అంటే డ‌బ్బు అవ‌స‌రం లేని ప‌నులు కొన్ని ఉంటాయ‌నుకోండి, అది వేరే విషయం, కాక‌పోతే పైసాకే ఇప్పుడు ఎక్కువ విలువుంద‌ని చెబుతున్నామ‌న్న‌మాట‌. అయితే కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌డంలో అంద‌రిక‌న్నా ముందు వ‌రుస‌లో దూసుకుపోతుంటారు. వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మ‌వుతుంటుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అయిపోతుంటుంది. ఆర్థిక స్థిర‌త్వం అనేది వారికి ఉండ‌దు. వీరితోపాటు అధిక శాతం మంది డ‌బ్బు సంపాదించేందుకు బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు. అయితే కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఎవ‌రికైనా ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌. వారు డ‌బ్బు సంపాదించ‌డంలో ముందుంటార‌ట‌. దీంతోపాటు ధ‌న‌వంతులుగా ఎదిగేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకోవాల‌ట‌. దీంతో ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌. గోమ్తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే గ‌వ్వ‌ల‌ను బేసి సంఖ్య‌లో ద‌గ్గ‌ర ఉంచుకున్నా ఆర్థికంగా లాభం జ‌రుగుతుంద‌ట‌. వీరికి శ‌త్రువుల నుంచి బాధ కూడా త‌ప్పుతుంద‌ట‌. తామ‌ర‌పూవు విత్త‌నాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటున్నా ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌. అలాంటి వారికి ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ట‌. రావి చెట్టు ఆకును ఒక దాన్ని శ‌నివారం పూట తీసుకుని దాని నీటితో శుభ్రంగా క‌డిగి, ఆ ఆకుపై హ్రీ అని రాసి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోతాయి. రూ.20 నోటు ఒక‌టి, రెండు రూపాయి నోట్లు తీసుకుని వాటిని వెండి తీగ‌తో క‌లిపి చుట్టి తెలుపు రంగు ప‌ర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోయి ఖ‌ర్చులు త‌గ్గుతాయి. ఆర్థిక స్థిర‌త్వం ఏర్ప‌డుతుంది.

follow these remedies if you want financial stability

ల‌క్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి. ధ‌నం బాగా స‌మ‌కూరుతుంది. శ్రీ‌యంత్రాన్ని ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకున్నా అంతా మంచే జ‌రుగుతుంది. అలాంటి వారికి డ‌బ్బు ప‌రంగా ఉన్న అన్ని స‌మ‌స్య‌లు పోతాయి. ల‌క్ష్మీ దేవి ఫొటోను ద‌గ్గ‌ర పెట్టుకున్నా, విష్ణువు పాదాల‌ను ముట్టుకున్నా అలాంటి వారికి అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. వారికి ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్ల‌ని వైట్ స్టోన్‌ను ద‌గ్గ‌ర ఉంచుకుంటే అది పాజిటివ్ శ‌క్తిని ఇస్తుంద‌ట‌. అలాంటి వారికి ప్ర‌శాంతత కూడా క‌లుగుతుంద‌ట‌. దీనికి తోడు వారి ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఏదైనా శుక్ర‌వారం రోజు చిన్న‌పాటి కొబ్బ‌రికాయ‌తో ల‌క్ష్మీ దేవికి పూజ చేసి ఆ కొబ్బ‌రికాయ‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. ఇలా చేసినా ఆర్థిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Admin

Recent Posts