నోటి దుర్వాసన ఉందంటే చాలు, ఎవరైనా నలుగురిలోకి వెళ్లినప్పుడు సరిగ్గా మాట్లాడలేరు. నవ్వలేరు. కలసి ఉండలేరు. ఎంతసేపు దూరం వెళ్దామా అని ట్రై చేస్తారు. ఈ క్రమంలో నోటి దుర్వాసన ఎలాంటి ఇబ్బందులను కలిగిస్తుందో అందరికీ తెలిసిందే. అయితే నోటి దుర్వాసన ఉందని చింతించాల్సిన పనిలేదు. కింద సూచించిన విధంగా పలు ఎఫెక్టివ్ టిప్స్‌ను పాటిస్తే చాలు. దాంతో నోటి దుర్వాసన పోతుంది. ఈ క్రమంలో ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో నోరు వాసన రాదు. పైగా తాజా శ్వాసను అందిస్తుంది.
గ్రీన్ టీలో ఫాలీ ఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. దీంతో ఇవి నోటి దుర్వాసనను తొలగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నోట్లో, నోటి లాలాజలంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఈ ఫాలీఫినాల్స్ ఉపయోగపడుతాయి. కనుక నోరు వాసనగా ఉంటే ఓ కప్పు గ్రీన్ టీ తాగడం ఉత్తమం. పచ్చి క్యాప్సికమ్ తిడనం వల్ల నోటి దుర్వాసనను వెంటనే తొలగించుకోవచ్చు. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది నోట్లో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నోరు దుర్వాసనగా ఉంటే ఒక యాపిల్ పండు తిన్నా చాలు. యాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ నోట్లో యాసిడ్స్ ను క్రమబద్దం చేస్తాయి. శ్వాసను తాజాగా మారుస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి ఎక్కువ తినే వారిలో ఇటువంటి సమస్య వస్తుంది. అయితే అలాంటి వారు వెల్లుల్లి తినగానే యాపిల్‌ను తింటే చాలు. దాంతో నోటి దుర్వాసన కంట్రోల్ అవుతుంది.
లవంగాలను మనం నిత్యం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఇవి నోటి దుర్వాసనను పోగొట్టేందుకు కూడా ఉపయోగపడతాయి. నోరు దుర్వాసనగా ఉంటే ఒక లవంగంను నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు. దాంతో ఆ సమస్య నుంచి వెంటనే బయట పడవచ్చు. దీని వల్ల నోరు తాజాగా మారుతుంది. చక్కని శ్వాస వస్తుంది. బ్రొకోలిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. నోటి నుంచి దుర్వాసన రాకుండా చూస్తుంది. శ్వాస తాజాగా ఉండేలా చేస్తుంది. నోరు రిఫ్రెష్ అవుతుందని సోంపును చాలా మంది వాడుతారు. ఎందుకంటే ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీంతో మనకు చక్కని తాజా శ్వాస అందడమే కాదు, నోటి దుర్వాసన కూడా పోతుంది.