ఆధ్యాత్మికం

Temple Hundi : ఆలయ హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే.. ఎలాంటి ఫలితం వస్తుంది..?

Temple Hundi : ఎప్పుడైనా ఆలయానికి వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక్క క్షణం అక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఏదో తెలియని వైబ్రేషన్స్ మనలో కలుగుతూ ఉంటాయి. శక్తి కలుగుతుంది. అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హుండీలో కొన్ని డబ్బుల్ని వేస్తూ ఉంటారు. హుండీలో డబ్బులు వేసి వారి యొక్క కోరికను భగవంతుడికి చెప్పి జరగాలని ప్రార్థిస్తారు. అయితే ఆలయాల్లో హుండీలో డబ్బులు వేసినప్పుడు ఎంత వేస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సప్త ఋషుల సంఖ్య ఏడు, తిరుమల కొండల సంఖ్య ఏడు. కలియుగ బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. అలానే రోగ నాశనం కోసం ఏడు రూపాయలని దేవుడు హుండీలో వేస్తే మంచిది. నవరాత్రుల సంఖ్య తొమ్మిది. శత్రుభాధలు శని బాధలు దూరం అవ్వాలంటే 9 రూపాయలని హుండీలో వెయ్యాలి. 11 చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. 11 రూపాయలని హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి.

how many rupees in hundi gives which result

కాళికా దేవి సిద్ధి సంఖ్య 12. 12 రూపాయల ని హుండీలో వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది. మహాగణపతి అనుగ్రహ సంఖ్య 21. 21 వేస్తే దురదృష్టము దూరమైపోతుంది. గురు అనుగ్రహ సంఖ్య 54. విజయ ప్రాప్తి ధన లాభం 54 రూపాయలని హుండీలో వేస్తే పొందవచ్చు.

కల్పవృక్ష ఆధార సంఖ్య 101. 101 రూపాయలని హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కోరికలు సిద్ధిస్తాయి. శ్రీ చక్ర మూల సంఖ్య విశ్వం యొక్క మూల సంఖ్య 108 . సకల కోరికలకి సిద్ధి కలుగుతుంది. కనుక 108 రూపాయలని హుండీలో వేస్తే మంచిది. ఆశీర్వాద మూల సంఖ్య 116. పుణ్యప్రాప్తి సప్త జన్మల పాపం పోవాలంటే 116 రూపాయలని హుండీలో వేస్తే మంచిది.

Admin

Recent Posts