ఆధ్యాత్మికం

తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీద ఎలా పడుతుంది..?

మనం చేసే పాపాలు మన పిల్లలకి తగులుతాయి అని అంటారు. అలానే మన పూర్వీకులు చేసిన పాపాలు, మనకి తగులుతాయని చెప్పడాన్ని మనం వింటూ ఉంటాం. దాన్నే జాతకం లో పితృ శాపం అంటారు. స్త్రీ శాపం అని కూడా దీనికి పేరు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏమైనా అన్నప్పుడు నన్ను అడిగి కన్నావా ఇప్పుడు నువ్వే భరించాలి అని పెద్దల మీద అరుస్తూ ఉంటారు.

కానీ నిజానికి వాళ్లని మీరే ఎంచుకున్నారు. ఎవరు ఏ వంశం లో పుట్టాలో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. జీవుడు తన చేసిన కర్మ వల్లే రాబోయే జన్మ లో తల్లిదండ్రులని కుటుంబాన్ని ఎంచుకుంటారు. ఆ కుటుంబంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. రాబోయే తరాలకి అది సంక్రమిస్తుంది.

how parents sin apply to kids

సర్పాలని చంపితే సర్ప శాపం తగులుతుంది. పితృదేవతలకి శ్రార్థం నిర్వహించకపోవడం వలన పితృ శాపం వస్తాయి. ఇలాంటివి జరిగినప్పుడు జీవితం లో ఎదుగుదల ఉండదు. ఉద్యోగాలు ఎవరికి రావు. వచ్చినా అభివృద్ధి ఏమీ ఉండదు. సంతానం కలగదు. వ్యాపారంలో కూడా నష్టం వస్తుంది. ఇవన్నీ కూడా పూర్వికులు చేసిన కారణంగా తర్వాత తరానికి కలిగి, తర్వాత తరం వాళ్లు అనుభవిస్తారు. ఇలా ఈ విధంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి తగులుతుంది.

Share
Admin

Recent Posts