కొందరికి తమ వస్తువులను ఇతరులతో పంచుకునే అలవాటు ఉంటుంది. బట్టలు, వాచీలు, బూట్లను తమ ఫ్రెండ్స్ కు ఇస్తారు. మిత్రుల వీరు ధరిస్తారు. కానీ అలా చేస్తే అశుభమట. మరి ఏ వస్తువులను ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందామా. ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వకూడదని ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉప్పు ఇతరులకు ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఉప్పు లక్ష్మీ దేవి స్వరూపం. అందుకే నేలపై పడితే తొక్కకూడదు.
ఇక నల్ల నువ్వులను కూడా ఉచితంగా తీసుకోకూడదు. నల్ల నువ్వులను ఉచితంగా తీసుకోవడం వలన శని ప్రభావం మనపై పడుతుంది. అలాగే వీటిని ఎవరికీ దానం చేయకూడదు. ఇనుము వస్తువులను కూడా దానంగా తీసుకోకూడదు. ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా దానికి ఎంత డబ్బు చెల్లించాలో అంతా చెల్లించి తీసుకోవాలి. ఇనుము కూడా శనికి చిహ్నం. అందుకే శనివారం పూట ఇనుము తెచ్చుకోవడం చాలా తప్పు. అలాగే సూది, చేతి రుమాలును కూడా ఇతరులకు ఉచితంగా ఇవ్వకూడదు.
మంచి నూనెను కూడా చేతికి ఇవ్వకూడదని చెబుతారు. వంటకు వాడే నూనెను ఎవరి వద్ద నుంచి అయినా ఉచితంగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా వారికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలి.