Business : డబ్బులు సంపాదించేందుకు చాలా మంది రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు ఉద్యోగాలు చేస్తే కొందరు వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపారంలోనూ కొందరు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి కొనసాగిస్తారు. కొందరు తమకు స్థోమతకు తగినట్లుగా వ్యాపారం చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి. అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ నష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. అలాంటి వారు దోష పరిహారం చేయాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన సూచనను పాటించాలి.
మీరు వ్యాపారంలో బాగా నష్టపోతుంటే ప్రతి గురువారం ఒకటిన్నర మీటర్ల పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏదైనా ఒక స్వీట్ తోపాటు ఒక కొబ్బరికాయను చుట్టి విష్ణువు ఆలయంలో సమర్పించాలి. విష్ణువు అవతారమైన శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ సమర్పించవచ్చు.
పైన చెప్పిన విధంగా చేయడం వల్ల వ్యాపారంలో ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. లాభాలను గడిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చు. సంపద సిద్ధిస్తుంది.
అలాగే మంగళవారం ఒక కొబ్బరికాయను తీసుకుని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాలి. అక్కడ ఉండే సింధూరంతో కొబ్బరికాయపై స్వస్తిక్ గుర్తు రాయాలి. దాన్ని చేతిలో పట్టుకుని హనుమాన్ చాలీసా చదవాలి. అనంతరం కొబ్బరికాయను స్వామివారికి సమర్పించాలి. ఇలా ప్రతి మంగళవారం 8 వారాల పాటు చేయాలి. దీంతో ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఏ పనిచేసినా కలసి వస్తుంది. వ్యాపారంలో రాణిస్తారు.