ఆధ్యాత్మికం

నిమ్మకాయ దీపం వెలిగిస్తున్నారా.. అయితే ఇవి తప్పకుండా పాటించాలి..

సాధారణంగా మనం ఏదైనా ఆలయాలను దర్శించి నప్పుడు అక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టడం మనం చూస్తుంటాం. అయితే నిమ్మకాయ దీపాలను ఇష్టానుసారంగా వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాలను వెలిగించేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అయితే ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా నిమ్మకాయల దీపాన్ని అమ్మవారి ఆలయాలలో వెలిగిస్తారు. అయితే కేవలం గ్రామ దేవతలైన పెద్దమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ వంటి దేవతల ఆలయాలలో మంగళవారం శుక్రవారాలలో నిమ్మకాయ దీపం వెలిగించాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా లక్ష్మీదేవి, పార్వతి దేవి ఆలయాలలో నిమ్మకాయ దీపం వెలిగించకూడదు.

if you are lighting lemon deepam then follow these

నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు కేవలం ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలను మాత్రమే వెలిగించాలి .అలాగే నిమ్మ పండ్లపై ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలి. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి రోజులలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు కింద ఎటువంటి ధాన్యాన్ని లేదా ఆకును ఉంచి దీపం వెలిగించాలి. ఈ విధంగా నిమ్మకాయ దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుజ, కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి.

Admin

Recent Posts