ఆధ్యాత్మికం

తులసి మాలను ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పనిసరి!

సాధారణంగా భక్తులు తమ ఇష్టదైవాను గ్రహం కోసం మాలలను ధరించడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే మాలలను ధరించి ఎంతో కఠిన దీక్షలో ఉంటారు. ఇప్పటి వరకు శివ మాల, అయ్యప్ప మాల, భవాని మాల గురించి విన్నాము. ఈ మాలలు ధరించేవారు ఎంతో కఠిన నియమాలను పాటిస్తారు. అదేవిధంగా రుద్రాక్ష మాలలను ధరించే వారు కూడా కొన్ని నియమాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే తులసి మాలను ధరించేటప్పుడు భక్తులు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. మరి ఆ నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

తులసిని గ్రంథాలలో ఎంతో స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తులసి అంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. తులసి మాల లేనిదే విష్ణుపూజ అసంపూర్ణం. విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించి పూజ చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అయితే తులసిమాలను కేవలం విష్ణుభక్తులు, కృష్ణ భక్తులు మాత్రమే ధరిస్తారు. ఈ మాలను ధరించినపుడు ఈ నియమాలు తప్పనిసరి.

if you are wearing tulsi mala then follow these rules

* తులసిమాలను ధరించేటప్పుడు మాలను గంగాజలంతో శుభ్రం చేసి తడి ఆరిన తర్వాత ధరించాలి.

*తులసి మాలను ధరించిన భక్తులు ప్రతి రోజు విష్ణు సహస్రనామాలు జపించవలసి ఉంటుంది.

*మాలను ధరించిన వారు ఎట్టి పరిస్థితులలో కూడా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ నియమాలను పాటిస్తూ తులసి మాలను ధరించాలి. అప్పుడే ఆ విష్ణు అనుగ్రహం మనపై కలుగుతుంది.

Admin

Recent Posts