మనకు తినేందుకు మూడు రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రాక్ సాల్ట్, రెండోది సాధారణ ఉప్పు, మూడోది బ్లాక్ సాల్ట్. సాధారణ ఉప్పును సముద్రం నుంచి తయారు చేస్తారు. ముందుగా ఉప్పును సేకరిస్తారు. తరువాత దాన్ని రీఫైన్ చేస్తారు. అనంతరం దానికి అయోడిన్ కలుపుతారు. దీంతో సాధారణ ఉప్పు తయారవుతుంది.
సాధారణ ఉప్పులో 97 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన 3 శాతం ఇతర పదార్థాలు ఉంటాయి. ఇక రాక్ సాల్ట్‌ను సహజంగా తయారు చేస్తారు. పర్వతాల్లో గనుల తవ్వకం ద్వారా రాక్ సాల్ట్‌ను తయారు చేస్తారు. రాక్ సాల్ట్ అత్యంత సహజమైంది. ఇందులో 85 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది. మిగిలిన 15 శాతం మొత్తంలో 84 రకాల మినరల్స్ ఉంటాయి. వాటిల్లో ఐరన్, కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, మెగ్నిషియం, సెలీనియం మొదలైనవి ఉంటాయి.
సాధారణ ఉప్పులో అయోడిన్‌ను కలపాల్సి ఉంటుంది. కానీ రాక్ సాల్ట్‌లో అలా కాదు. అందులో అయోడిన్ సహజంగానే ఉంటుంది. అందువల్ల దాన్ని ప్రత్యేకంగా కలపాల్సిన పనిలేదు. ఇక రాక్ సాల్ట్‌ను సహజంగా తయారు చేస్తారు కనుక అదే మన శరీరానికి మంచిది. సాధారణ ఉప్పు మంచిది కాదు.
రాక్ సాల్ట్‌ను ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా అయోడిన్ లోపం తగ్గుతుంది. చర్మం, వెంట్రుకలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి. హైబీపీ తగ్గుతుంది. సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి, మలబద్దకం తగ్గుతాయి.