ఆధ్యాత్మికం

తులసీ దళాలను ఏరోజు కోయకూడదో తెలుసా?

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను దైవ సమానంగా భావిస్తారు. అందుకే ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మనకు దర్శనమిస్తుంది. ఎంతో పరమ పవిత్రమైన తులసి మొక్కలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి కొలువై ఉంటారని భక్తులు భావిస్తారు. అందుకోసమే తులసి మొక్కను దైవ సమానంగా భావించి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి పూజలు నిర్వహిస్తారు. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్క ఆకులను కొందరు ఎప్పుడు పడితే అప్పుడు కోస్తుంటారు. అయితే తులసి దళాలను ఏ రోజుల్లో కోయకూడడో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా కొంతమంది వారికి వీలున్నప్పుడల్లా తులసీ దళాలను కోస్తారు. ఈ విధంగా కోయ కూడదని పండితులు చెబుతున్నారు. తులసీ దళాలను ఆదివారం, శుక్రవారాలలో, యుగాదులు, సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, రాత్రి సమయంలోనూ, సాయంత్రం సమయంలో కోయకూడదని పండితులు చెబుతున్నారు.

on which day you do not pick tulsi leaves on which day you do not pick tulsi leaves

ఎంతో పరమపవిత్రమైన ఈ తులసి చెట్లు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. తులసి మొక్కను కేవలం ఒక పవిత్రమైన మొక్కగా భావించడమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కగా కూడా భావిస్తారు. ఈ క్రమంలోనే మనం ఏదైనా దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు రెండు తులసి ఆకులను నమలడం వల్ల తొందరగా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కకు ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతుందని ప్రగాఢ విశ్వాసం.

Admin

Recent Posts