ఆధ్యాత్మికం

Deepam : ఇంట్లో రోజూ దీపం పెట్టేటప్పుడు.. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Deepam &colon; ప్రతి రోజు కూడా ప్రతి ఇంట దీపం వెలగాలి&period; దీపం ఇంట్లో వెలగకపోతే ఆ ఇంటికి అసలు మంచిది కాదు&period; అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే దీపారాధన చేస్తూ ఉంటారు&period; నిజానికి దీపాన్ని కూడా పూజించడం చాలా ముఖ్యం&period; దీపం పరబ్రహ్మ స్వరూపం&period; ఆత్మ స్వరూపం&period; మనలోనూ నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది&period; అందుకే మనం జీవించి ఉన్నాం&period; మనం దీపం వెలిగిస్తే అక్కడికి దేవతలు వస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధన చేసేటప్పుడు కూడా కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి&period; మరి దీపం పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం&period; ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించాలి&period; సాయంత్రం స్నానం చేసి మళ్లీ దీపం వెలిగించాలి&period; ఒకవేళ సాయంత్రం పూట స్నానం చేయలేని స్థితిలో ఉంటే కనీసం ముఖం&comma; కాళ్లు&comma; చేతులు&comma; నోరు కడుక్కుని దీపారాధన చేస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52062 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;deepam-1&period;jpg" alt&equals;"rules to follow when lighting deepam daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధన చేయడానికి ప్రతిరోజూ తలస్నానం చేయక్కర్లేదు&period; మామూలు స్నానం చేస్తే చాలు&period; ఎప్పుడూ కూడా స్త్రీలు ఇనుప ప్రమిదలో దీపం పెట్టకూడదు&period; బంగారం&comma; వెండి లేదంటే మట్టి వాటిలోనైనా దీపం పెట్టొచ్చు&period; దీపపు ప్రమిదని ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు&period; అప్పుడు దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది&period; దీపం పెట్టడానికి ముందు కచ్చితంగా ఇల్లు శుభ్రపరచాలి&period; అప్పుడే దీపాన్ని పెట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి&comma; కొంచెం పసుపు&comma; కుంకమ చల్లి అప్పుడు దీపం ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి&period; ఇవన్నీ రోజూ ఉదయం అవ్వవు కదా అనుకుంటే రోజు మీరు మామూలుగా పెట్టేసి పండగ రోజు సెలవు రోజుల్లో ఈ విధంగా పాటిస్తే మంచిది&period; దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగిస్తే మంచిది&period; లేదంటే నువ్వుల నూనె కూడా వాడొచ్చు&period; కొబ్బరి నూనెతో అయినా దీపం పెట్టొచ్చు&period; రెండు పూట్ల దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది&period; వ్యాపారం అభివృద్ధి చెందుతుంది&period; దుష్టశక్తులు పోతాయి&period; నిత్యం దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి&period; ఇంట్లో శాంతి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts