Lakshmi Devi : ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండి కలకాలం ఆనందంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి లోటు ఉండదు. ఆనందంగా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి. లక్ష్మీ దేవి వచ్చే ముందు కనపడే సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ రోజుల్లో డబ్బే అన్నింటినీ నడిపిస్తోంది. ప్రేమ, అనుబంధాలు ఇటువంటివి ఏమైనా ఉండాలంటే కచ్చితంగా డబ్బు ఉండాల్సిందే.
లక్ష్మీదేవిని హిందువులు ప్రత్యేకంగా పూజిస్తారు. శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. శుక్రవారం నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబు అయ్యి వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. అలా చేయడం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇల్లు శుభ్రంగా లేకుండా, వాకిట్లో ముగ్గు లేకుండా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. గుమ్మం నుండి చూస్తే పెరట్లో అరటి చెట్టు, తులసి మొక్క కనపడితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అటువంటి చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు కలుగుతాయి. డబ్బు కావాలని ధనవంతులు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. కోకిల కూత చాలా వినసొంపుగా ఉంటుంది. కోకిల చేసే శబ్దం ధనానికి సూచనగా భావిస్తారు. ఆగ్నేయం వైపు కోకిల కూసింది అంటే అక్కడ లక్ష్మీదేవి ఉందని దానికి సంకేతం.
మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే కూడా లక్ష్మీదేవి అక్కడ ఉందని అంటారు. నల్ల చీమలు ఇంట్లో తిరుగుతున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని దానికి సంకేతం. బల్లి కూడా సంపదకి చిహ్నం. ఇంట్లో ఎప్పుడైనా పాము కనపడితే చంపకుండా బయటకు వెళ్లడానికి మార్గాన్ని చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. గొడవలు లేని ఇంట, శుభ్రంగా ఉన్న ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. ఆ ఇంట డబ్బుకి లోటు ఉండదు.