Vastu Tips : సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సమస్యలు లేని వారు అస్సలు ఉండరు. అయితే కొందరికి మాత్రం అన్నీ కష్టాలే ఎదురవుతుంటాయి. వాటి నుంచి బయట పడలేకపోతుంటారు. అందుకు వాస్తు దోషం కారణమవుతుంటుంది. కానీ నెమలి ఈకలను కింద తెలిపిన విధంగా ఇంట్లో పెట్టుకోవడం వల్ల అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి. కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ధనం, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి. మరి అందుకు నెమలి ఈకలను ఎలా ఉపయోగించాలంటే..
ఇంట్లో మీరు ధనం, బంగారం ఉంచే చోట ఒక నెమలి ఈకను పెట్టాలి. లాకర్ అయితే ఇంకా మంచిది. ఇంట్లో ఒక లాకర్ పెట్టి అందులో డబ్బు, ధనం, ఇతర విలువైన వస్తువులు, పత్రాలను ఉంచాలి. వాటి పక్కనే ఒక నెమలి ఈకను పెట్టి లాకర్‌కు తాళం వేయాలి. ఇలా చేయడం వల్ల ఆ నెమలి ఈక ధనాన్ని ఆకర్షిస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.
అలాగే ఆఫీస్‌లో లేదా వ్యాపారం చేసేవారు తాము ఉండే కార్యాలయంలో నెమలి ఈకను ఎవరూ చూడని చోట ఒక గదిలో ఉంచాలి. దీంతో ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని రాణిస్తారు.
ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏదైనా అలంకరణ వస్తువులో నెమలి ఈకను ఉంచి కట్టాలి. దీంతో ఇంట్లోకి దుష్ట శక్తులు, నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉంటాయి. దీని వల్ల ఇంట్లోని వారికి సమస్యలు తప్పుతాయి. ఏ పనిచేసినా విజయం లభిస్తుంది.