ఆధ్యాత్మికం

వివాహం కాని వారు ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. వెంట‌నే పెళ్లి అవుతుంది..!

ఈ దేవాలయాన్ని ఎక్కువగా పెండ్లి కాని యువతీయువకులు సందర్శిస్తుంటారు. ఈ దేవాలయానికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కళ్యాణ పూజ చేసిన ఆనతికాలంలోనే తప్పకుండావివాహం నిశ్చయమవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఈ దేవాలయం ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటో తెలుసుకోండి. మహావిష్ణువు 108 దివ్యదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నిత్య కళ్యాణ పెరుమాళ్‌ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో తిరువిడందై ప్రాంతంలో ఉంది. ఇందులో మహా విష్ణువు నిత్య కళ్యాణ పెరుమాల్‌గా, లక్ష్మీదేవి కోమలవల్లిగా పూజలందుకుంటున్నారు.

త్రేతా యుగంలో మేఘనాథుడి కుమారుడు బాలి తన రాజ్యాన్ని న్యాయంగా పాలిస్తున్న సమయంలో.. మాలి, మాల్యవన్‌, సుమాలి అనే రాక్షసులు దేవతలపై యుద్ధం చేయడానికి బాలి సహాయం కోరుతారు. బాలి అందుకు నిరాకరిస్తాడు. దీంతో రాక్షసులు ఓడిపోతారు. మళ్లీ యుద్ధం చేయడం కోసం రాక్షసులు బాలిని సహాయం అడగగా ఈసారి సహాయం చేయడానికి ఒప్పుకొని యుద్ధంలో రాక్షసులను గెలిపిస్తాడు. దీంతో బాలి బ్రహ్మహత్యా దోషాన్ని మూటగట్టుకుంటాడు. ఆ దోష నివారణకౌ బాలి ఇక్కడికి వచ్చి తపస్సు చేయగా, మహా విష్ణువు మెచ్చి వరాహ రూపంలో దర్శనమిస్తాడు. మహర్షి కుని, తన కుమార్తెతో సహా స్వర్గానికి చేరుకోవాలనే కోరికతో నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ, కునికి మాత్రమే స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది. ఆమె కుమార్తె వెళ్లలేకపోయింది. నారద మహర్షి ఆ యువతి దగ్గరికి వచ్చి నీకు పెండ్లి కానందుకున ఇలా జరిగిందని చ్పెపగా, తనను వివాహమాడమని వేరే మునులను కోరుతుంది. ఒక కలవ మహర్షిని పెళ్లాడి 360 మంది ఆడపిల్లలకు జన్మనిస్తుంది.

those who are not married should visit this temple

తన కుమార్తెలను వివాహమాడమని ప్రార్థిస్తూ కలవ మహర్షి నారాయణుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ నారాయణుడు ప్రత్యక్షం కాడు. ఒకరోజు దివ్యరేశ యాత్ర చేస్తున్నానని చెప్పి వారి వద్దకు ఒక యువకుడు వస్తాడు. అతను నారాయణుడంత అందంగా కనిపించడంతో ముగ్ధుడైన కలవ మహిర్షి తన కుమార్తెలను పెండ్లి చేసుకోమని కోరుతాడు. ఆ యువకుడు అంగీకరించి రోజుకు ఒకరిని చొప్పున 360 రోజుల పాటు 360 మందిని పెండ్లి చేసుకుంటాడు. చివరి రోజున తాను మరెవరో కాదు వరాహ రూపంలో ఉన్న నారాయణుడని నిజం చెప్పి 360 భార్యలను కలిపి ఒక స్త్రీమూర్తిగా చేసి తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకుంటాడు. ఏడాదిలో అన్ని రోజులు వివాహం జరిగినందున ఈయన నిత్య కళ్యాణ పెరుమాళ్‌ అనే పేరు వచ్చింది.

పెండ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న యువతులు ఇక్కడ కొలువై ఉన్న కోమలవల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థిస్తే వెంటనే వివాహం నిశ్చయమవుతుందనే నమ్మకం ఇక్కడి ప్రజలలో ఎక్కువగా ఉండడంతో ఎప్పుడూ ఈ దేవాలయం యువతులతో కలకళలాడుతుంటుంది. సమయం : ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నై ఈసిఆర్‌, మహాబలిపురం వెళ్లే బస్సులన్నీ తిరువిడందై మీదుగా వెళ్తాయి.

Admin

Recent Posts