ఆధ్యాత్మికం

Lord Surya Dev : రోజూ సూర్యున్ని త‌ప్ప‌క పూజించాలి.. ఎందుకో తెలిస్తే త‌ప్ప‌క ఆ ప‌నిచేస్తారు..!

Lord Surya Dev : చాలా మంది సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు. సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. పూజ అయిన తర్వాత, సూర్యుడు వుండే తూర్పు దిక్కు కి తిరిగి సూర్య నమస్కారాలను చాలా మంది చేస్తూ ఉంటారు. నిజానికి సూర్యుడు లేకపోతే సమస్తము లేదు. మనమూ లేము.. ఏ జీవులూ లేవు. సూర్యుడు దక్షిణాయాన్ని ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలని కూడా మనం విశేషంగా జరుపుకుంటూ ఉంటాము.

అదేనండి సంక్రాంతి, రథసప్తమి. అయితే చాలామంది నిజంగా సూర్యుడు భగవంతుడా..? ఎందుకు ఆరాధించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా అందరికీ సూర్యుడు వెలుగుని ఇస్తారు. సృష్టి లో సంపదకి కానీ విద్యా విజ్ఞానాలకి కానీ మూలపురుషుడు సూర్య భగవానుడు. పురాణాలలో కూడా సూర్యుడు వల్లే సంపద కలుగుతుందని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.

we need to pray lord surya daily

సూర్యుడు ఇప్పుడే కాదో ఎప్పటి నుండో మనకి ప్రత్యేకమే. భగవంతుడు అని చెప్పేందుకు ఇవే మంచి ఉదాహరణలు. అరణ్యవాసం సమయంలో ధర్మరాజు తన వెంట వచ్చిన పౌరులకి, మునులకి ఆహారాన్ని ఎలా కల్పించాలి అని సూర్యుడుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఒక అక్షయపాత్రన్ని ఇస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను ఇస్తూ ఉంటుంది.

సత్రాజుత్తు అని రాజు కూడా సూర్యుడిని ప్రార్థించి సమంతకమనే మణి ని పొందుతాడు ఆ మణి రోజూ బంగారాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆంజనేయస్వామి సూర్యుని దగ్గరే వేద శాస్త్రాలని అభ్యసించారు. అలానే బుద్ధుని ప్రేరేపించే వాడు సూర్యుడు అని అంటారు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు అని కూడా అంటారు. జీవుల పుట్టుక పోషణకు కావాల్సినవన్నీ సూర్యుడి వల్లే లభిస్తున్నాయి. సూర్య నమస్కారాలు వలన ఆలోచన ప్రక్రియ శుద్ధిచేసి, తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి.

Admin

Recent Posts