ఆధ్యాత్మికం

తులసి మొక్కలో జరిగే మార్పులు దేనికి సంకేతమో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ దేవిగా భావించి ప్రతి రోజు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి ఇంటి ఆవరణంలో తులసి మొక్క మనకు దర్శనం కల్పిస్తుంది. అయితే కొన్ని సార్లు తులసి మొక్కలో అనుకోకుండా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ విధంగా తులసి మొక్కలో జరిగే మార్పులు దేనికి సంకేతం? తులసి మొక్కలో మార్పులు దేనిని సూచిస్తాయో తెలుసుకుందాం.

సాధారణంగా మనం తులసి మొక్కకు నీళ్లు పోయకుండా ఉన్నా కొన్నిసార్లు ఎంతో పచ్చగా, ఏపుగా పెరుగుతుంది.తులసి మొక్క ఈ విధంగా పెరగటం వల్ల మన ఇంట్లోకి అదృష్టం కలిసి వస్తుందని సంకేతం. అలాగే నిత్యం పచ్చగా ఉండే తులసి మొక్క ఉన్నఫలంగా ఎండిపోతే ఆ కుటుంబ యజమానికి ప్రమాదం రాబోతుందని సంకేతం.

what happens if there are changes in tulsi plant

అదేవిధంగా కొన్నిసార్లు ఎంతో పచ్చగా ఉండే తులసి ఆకులు రంగు మారుతాయి. ఇలా తులసి ఆకులు రంగు మారటం వల్ల మన ఇంటి పై దృష్టి పడిందని సంకేతం. అలాగే మన శత్రువులు మన ఇంటి పై చెడు కార్యాలను చేస్తుంటారని చెప్పడానికి సంకేతం. ఈ విధంగా తులసి చెట్టులో ఉన్నఫలంగా మార్పులు చోటు చేసుకోవడం వల్ల మన ఇంట్లో అశుభ ఫలితాలు కలుగుతాయని వేద పండితులకు తెలియచేస్తున్నారు.

Admin

Recent Posts