ఆధ్యాత్మికం

ధ్వజస్తంభం లేని గుడిలో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా..?

సాధారణంగా హిందూ దేవాలయల్లో ధ్వజస్తంభాన్ని చాలా ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తారు. దేవాలయాల్లో గర్భగుడిని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయం గానూ భావిస్తారు. ఆలయంలో మూల విరాట్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ ఏమిటి ఆలయంలో ధ్వజస్తంభం లేకుంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. మన పెద్దవారు ఏది చేసినా దాని వెనక ఎంతో సైన్సు,అర్థం, పరమార్థం దాగి ఉంటుంది.

దేవాలయాల్లో ధ్వజ స్తంభాల‌ స్థాపన వెనుక కూడా చాలా రహస్యం ఉంటుంది ధ్వజస్తంభం ఆలయానికి మరియు దైవ లోకానికి మధ్య వారధిగా ఉంటుంది. ధ్వజస్తంభం అంతరిక్షంలో ఉండే దైవ శక్తులను తనలోని ఆవాహన చేసుకుని ఆలయానికి మరింత శక్తిని ఇస్తుంది. అలాగే ధ్వజస్తంభం ఆలయం కంటే చాలా ఎత్తుగా ఉండటం వెనుక మరొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ధ్వజస్తంభం ఆలయ నిర్మాణం కంటే ఎత్తుగా ఉండటం వల్ల, అది ఆలయంలో పిడుగులు పడకుండా పిడుగు నుంచి విద్యుత్ శక్తిని ఇస్తుంది. ధ్వజస్తంభం ప్రతిష్టించే ముందు కూడా దానికింద అనేక ధాతువులను నిక్షిప్తం చేస్తారు.

what is the importance of dhwaja sthambham in temple

ధ్వజస్తంభం దగ్గర ఉండే బలిపీఠంలో శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే గుడి లోకి వెళ్లే ముందు ధ్వజస్తంభం దగ్గర ఉన్న బలిపీఠంకి నమస్కరించాలని చెబుతారు. విద్యుత్ అయస్కాంత శక్తిని తనలో ఇముడ్చుకున్న బలిపీఠం తాకడం వలన పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పూర్వం అడవి గుండా ప్రయాణించే బాటసారులు ఎత్తుగా ఉండే స్తంభాలే కనబడేవి. వీటి ఆధారంగా దగ్గరలో ఊరు ఉందని గమనించి బాటసారులు ఆ విధంగా ఊరికి వెళ్లి గుళ్లో సేదతీరేవారు.

Admin

Recent Posts