ఆధ్యాత్మికం

కలశం పై ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు ముందుగా ఆ కార్యంలో కలశం ఏర్పాటు చేస్తాము. మన స్థాయికి తగ్గట్టుగా రాగి, వెండి చెంబుకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు. ఆ చెంబులోకి నిండు బిందె నీళ్ళను తీసుకొని అందులో కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ పువ్వులు వేసి ఆ చెంబు పై టెంకాయను ఉంచి చుట్టూ మావిడాకులు అలంకరిస్తారు.

ఈ విధంగా శుభకార్యాలలో కలశం ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తుంది. అయితే పూజ అనంతరం కలశంపై ఉన్న టెంకాయను ఏం చేయాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే కలశంపై ఉన్న టెంకాయను మన ఇంట్లో పూజ చేయడానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఒకవేళ బ్రాహ్మణులు లేనిపక్షంలో ఆ టెంకాయను పారుతున్న నీటిలో వేయడం వల్ల ఎటువంటి దోషాలు ఉండవు.

what to do with kalasham coconut

దేవాలయంలో కలశాన్ని పెడితే అది పూర్ణాహుతి చేస్తారు. అదే కలశం మన ఇంట్లో పెడితే దానిని బ్రాహ్మణులకు లేదా పారుతున్న నీటిలో నిమజ్జనం చేయాలని మన పెద్దవారు చెప్పేవారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

Admin

Recent Posts