పని చేస్తుంటే… నిద్ర వస్తోందా? ఒక గుడ్డు తినేయండి.. ఇక నిద్ర పోవటమే కాదు ఎంతో ఎలర్ట్ అయి పనిచేయటంలో మీ తెలివిని ప్రదర్శిస్తారు…. అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్శిటీ సైంటిస్టులు. ప్రత్యేకించి, ఎగ్ లోని తెల్లటి పదార్ధంలోని ప్రొటీన్లు మిమ్మల్ని ఎంతో మెళకువతో వ్యవహరించేట్లు తెలివితేటల్నిస్తాయని చెపుతున్నారు.
అంతే కాక గుడ్డులో వుండే కొల్లెస్టరాల్ గుండెకు హని చేయదన్నారు. గుడ్డు తిని పని మొదలు పెట్టడం మంచిదన్నారు. శాట్యురేటెడ్ కొవ్వులు హాని చేస్తాయి కాని గుడ్డులోని కొల్లెస్టరాల్ హాని చేయదని వీరు కనుగొన్నారు. ఈ రకమైన ఆహార పదార్ధాలు బ్రెయిన్ సెల్స్ బాగా చురుకు అయేట్లు చేస్తాయని, రెంటిలోను కేలరీలు ఒకే రకంగా వున్నప్పటికి, ప్రొటీన్ శరీరానికి కేలరీలు ఖర్చుచేయటంలో తెలివైన సలహాలనిస్తుందన్నారు.
ఈ ఫలితాలు న్యూరాన్ జర్నల్ లో ప్రచురించారు. తక్షణ శక్తి కొరకు సాధారణంగా చాక్లెట్లు, బిస్కట్లు, స్వీట్లు తింటారని అయితే వీటిలో వుండే కార్బోహైడ్రేట్లకంటే కూడా గుడ్డులోని ప్రొటీన్లు అమోఘంగా పనిచేస్తాయని కేంబ్రిడ్జి యూనివర్శిటీ రీసెర్చర్లు కనిపెట్టినట్లు ది డైలీ మెయిల్ వార్తా పత్రిక తెలిపింది.