ఆధ్యాత్మికం

Japamala : జ‌ప మాల‌లో 108 పూస‌లు ఎందుకు ఉంటాయో తెలుసా..?

Japamala : జ‌పం లేదా ధ్యానం చేసేట‌ప్పుడు కొంద‌రు చేతిలో ఓ మాల‌ను ప‌ట్టుకుని తిప్పుతారు తెలుసు క‌దా..! దానికి 108 పూస‌లు కూడా ఉంటాయి. అయితే ఎవ‌రు జ‌పం చేసినా త‌మ ఇష్టానికి అనుగుణంగా ఒక్కో ర‌క‌మైన మాల‌ను చేత ప‌ట్టుకుంటారు. ఏ మాల చేతిలో ప‌ట్టుకున్నా అందులో క‌చ్చితంగా 108 పూస‌లు మాత్ర‌మే ఉంటాయి. ఒక‌టి ఎక్కువ ఉండ‌దు, ఒక‌టి త‌క్కువ ఉండ‌దు. ఈ క్ర‌మంలో అస‌లు అలా జ‌ప మాల‌కు 108 పూస‌లు మాత్ర‌మే ఎందుకు ఉంటాయో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నిషి ఒక నిమిషానికి దాదాపుగా 10 నుంచి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఈ క్ర‌మంలో రోజుకు ఆ రేటు 21,600 వ‌ర‌కు అవుతుంది. అయితే రోజుకు 24 గంట‌లు క‌దా, అందులో కేవ‌లం 12 గంట‌లు మాత్ర‌మే మ‌నం యాక్టివ్‌గా ఉంటామ‌ట‌. ఇంకో 12 గంటలు యాక్టివ్‌గా ఉండ‌మ‌ట‌. ఈ క్ర‌మంలో కేవ‌లం 12 గంట‌ల‌ను మాత్ర‌మే లెక్క‌లోకి తీసుకుంటే ముందు చెప్పిన 21,600లో స‌గం మాత్ర‌మే తీయాలి. అంటే అప్పుడ‌ది 10800 అవుతుంది. అయితే 12 గంట‌ల్లో దేవున్ని మ‌నం 10800 సార్లు త‌ల‌చుకోలేం క‌దా, అందుక‌ని ఆ చివ‌రి రెండు సున్నాలు తీసేసి 108 సార్లు త‌ల‌చుకుంటే చాల‌ట‌. దీంతో చాలా పుణ్యం ల‌భిస్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే జ‌పం చేసే మాల‌కు కూడా అదే 108 సంఖ్య‌ను బ‌ట్టి పూస‌లు ఉంటాయట‌.

సృష్టి 12 పార్ట్‌లుగా విభ‌జించ‌బ‌డింద‌ని పురాణాలు చెబుతున్నాయి. ఇక్క‌డ 12 పార్ట్‌లు అంటే 12 రాశులే. వీటిని న‌వ‌గ్ర‌హాలైన 9 అంకెను గుణించాలి. అప్పుడు 108 వ‌స్తుంది. ఆ ప్ర‌కారం కూడా జ‌ప మాల‌లో 108 పూస‌లు ఉంటాయ‌ట‌. సౌర‌వ్య‌వ‌స్థ ప్ర‌కారం 1 అంటే దేవుడ‌ని, 0 అంటే శూన్య‌మ‌ని, 8 అంటే అనంత‌మ‌ని అర్థాలు వ‌స్తాయి. అందులో భాగంగానే జ‌ప మాల‌లో 108 పూస‌లు అమ‌ర్చార‌ట‌. గంగాన‌ది 12 డిగ్రీల రేఖాంశం, 9 డిగ్రీల అక్షాంశంలో విస్త‌రించి ఉంటుంద‌ట‌. అంటే మొత్తం 12 x 9 = 108 వ‌స్తుంది. అందు వ‌ల్ల కూడా జ‌ప మాల‌లో 108 పూస‌లు అమ‌ర్చిన‌ట్టు చెబుతారు.

why 108 beads in japamala

సంస్కృతంలో 108 సంఖ్య‌ను హ‌ర్ష‌ద్ నంబ‌ర్ అని పిలుస్తారు. అంటే.. అందులో ఉన్న అంకెల‌ను కూడితే మొత్తం 9 వ‌స్తుంది. 9తో మ‌ళ్లీ 108 ను భాగించ‌వ‌చ్చు క‌దా. అందుక‌ని దాన్ని అలా పిలుస్తారు. ఈ క్ర‌మంలోనే జ‌ప మాల‌లో కూడా 108 పూస‌లు వ‌చ్చాయ‌ని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ఈ విశ్వంలో మొత్తం 27 న‌క్ష‌త్ర మండ‌లాలు ఉన్నాయ‌ట‌. ప్ర‌తి న‌క్ష‌త్ర మండ‌లంలో రెండు భాగాలు ఉంటాయ‌ట‌. ఇలా 27 న‌క్ష‌త్ర మండ‌లాల్లో ఉన్న అన్ని భాగాలు క‌లిపి మొత్తం 108 అవుతుంద‌ట‌. అందుక‌ని జ‌ప‌మాల‌కు కూడా ఆ సంఖ్య వ‌ర్తిస్తుంద‌ని అంటారు.

సూర్యుడు ఒక ఏడాదిలో మొత్తం 2,16,000 సార్లు మారుతాడ‌ట‌. అంటే ఆరు నెల‌ల‌కు అది 1,08,000 అవుతుంది. అందులో నుంచి 3 సున్నాలు తీసేస్తే 108 అవుతుంది. అప్పుడు జ‌ప‌మాల‌లో ఉన్న పూసల సంఖ్య వ‌స్తుంది. జ‌ప మాల అంటే 108 పూస‌లు మాత్ర‌మే కాదు, కొంద‌రు దాన్ని రెండు, మూడు, నాలుగు భాగాలుగా విభ‌జించి అప్పుడు వ‌చ్చే పూస‌ల ప్ర‌కారం మాల‌ను ధ‌రిస్తారు. అంటే వారు.. 54, 36, 27, 9.. ఇలా సంఖ్య వ‌చ్చేలా పూస‌లు జ‌ప మాల‌కు క‌ట్టి దాంతో జ‌పం చేస్తారు. జ‌ప‌మాల‌లో అన్నింటి క‌న్నా పైన ఉండే పూస‌ను సుమెరు అని పిలుస్తారు. దీంతోనే జ‌పం ప్రారంభించి, దీంతోనే ముగిస్తారు. అనంత‌రం నుదుటిపై దీన్ని న‌మ‌స్క‌రించుకుంటారు.

జ‌ప‌మాల‌ను తుల‌సి, రుద్రాక్ష లేదా ఇత‌ర ర‌త్నాల‌తో చేస్తారు. దేంతో చేసినా పైన చెప్పిన విధంగా 108 లేదా అందులో రెండు, మూడు, నాలుగు ఇలా భాగాలుగా విభ‌జించి పూస‌ల‌ను వేసి మాల‌ను త‌యారు చేస్తారు. అయితే ఏ మాల‌తో జ‌పం చేసినా దాంతో దైవం సాక్షారిస్తాడ‌ట‌. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంద‌ట‌.

Admin

Recent Posts