ఆధ్యాత్మికం

చనిపోయిన వ్యక్తులను కొంద‌రు పూడ్చి పెడతారు, ఎందుకో తెలుసా?

ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో, అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవ్వరికి తెలియదు. మనిషి జననం, మరణం అనేది ఇప్పటికీ అంతు బట్టని రహస్యమే. మన కుటుంబంలో కానీ, మన స్నేహితులలో కానీ ఎవరైనా చనిపోతే చాలా కొద్ది మందికి వారు కలలో కనిపిస్తారు. చనిపోయిన వారు కలలో కనిపించడం వల్ల కొంత మంది భయాందోళనలకు గురవుతారు. కొన్ని మతాల్లో చనిపోయిన వ్యక్తులను పూడ్చి పెడతారు. ఎందుకు అలా పూడ్చి పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇస్లాంలో, క్రిస్టియన్ మతంలో చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెడతారు, తప్ప హిందూ ధర్మంలో లాగా చితి పైన మృతదేహాన్ని కాల్చ‌రు. అందుకు కారణం యుగాంతంలో మన శరీరాలు సమాధి లోంచి లేచి దేవుడికి లెక్క చెప్పవలసి ఉంటుంది. పాపాలు చేసిన వారు నరకానికి వెళ్లి శిక్షలు అనుభవిస్తారు.

why do some people bury dead bodies

ఇక పుణ్యాలు చేసి దేవుడి నామస్మరణ చేసిన వారు స్వర్గానికి వెళ్లి సంపద, స్త్రీలు, ఇలా భౌతిక సుఖాలతో పాటు, ఐహిక సుఖాలను కూడా పొందుతారు. అలాగే ఇస్లాం మతంలో కుడి, ఎడమ భుజాలపైన మనకు కనిపించని ఇద్దరు ఉంటారు. వారు పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు లెక్క కడతారు. క్రిస్టియన్ మతంలో కూడా అంతే. ఇదండీ, ప్రధాన మతాల్లో మరణం వెనుక మతలాబు. ఎవరు దేనిని నమ్ముతారో అది వారి ఇష్టం. ఎటు చేసి, భూమి మీద ఉన్నంత కాలం మనిషిలా ఉంటే చాలు.

Admin

Recent Posts