sports

పాండ్యా బ్రదర్స్ కు మరో బ్రదర్ ఉన్నాడు తెలుసా ?

పాండ్యా బ్రదర్స్ గా హార్దిక్ కృనాల్ పేర్లు మనకు సుపరిచితమే. వీరి సొంత రాష్ట్రం గుజరాత్ అయినా ముంబై ఇండియన్స్ ద్వారానే క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. 2017 సంవత్సరంలో ఆల్ రౌండర్ గా ముంబై తరఫున ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఆ తరువాత టీమిండియాకు కూడా వెంటనే సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలోనే అన్న కృణాల్ పాండ్యాను కూడా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.

అప్పటి నుంచి 2021 వరకు కూడా ఈ సోదర ధ్వయం ముంబై ఇండియన్స్ జట్టుకు కీలక ఆటగాళ్లుగా ఉంటూ వస్తున్నారు. అయితే 2022లో వీరి బంధం ముగిసింది. అంటే ఐపీఎల్ పరంగా అనుకోండి. మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వీరిని విడిచిపెట్టగా, గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసుకుంది. ఇక కృనాల్ ను వేలంలో లక్నో సూపర్ జెంట్స్ 8.25 కోట్లకు కొనేసింది. ఇది అప్ప‌టి క‌థ‌. ఇప్పుడు మళ్లీ వేరే జట్ల‌కు వీరు ఆడుతున్నారు.

do you know that pandya brothers have also another brother

ఇది ఇలా ఉండగా ఈ పాండ్యా బ్రదర్స్ కు మరో బ్రదర్ కూడా ఉన్నాడు. అచ్చం కృణాల్ పాండ్యా ఫేస్ కట్ తో ఓ బ్రదర్ ఉన్నాడు. అతడే వైభవ్ పాండ్య. ఈ వైభవ్ పాండ్యా కృనాల్ పాండ్యాకు కజిన్ బ్రదర్ అవుతాడు. ఇతని ఫేస్ కట్, అలాగే గడ్డం మొత్తం కృణాల్ పాండ్యాను పోలిన విధంగానే ఉంటాయి.

అంతే కాదండోయ్ కృణాల్ పాండ్యా కంటే చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉంటాడు వైభవ్ పాండ్యా. ఇతనికి కొత్త మోడల్ డ్రెస్సులు ధరించడం అంటే చాలా ఇష్టం. వైభవ్ పాండ్యా మీడియాలో ఎక్కువగా కనిపించకపోయినా తన ఇద్దరు పాండ్యా బ్రదర్స్ తో ఎప్పుడు క్రికెట్ గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటాడు. వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వైభవ్ పాండ్యా.

Admin

Recent Posts