lifestyle

భర్తలు ఈ తప్పులు చేస్తే భార్యలకు అనారోగ్యాలు తప్పవా..?

ఇంటికి దీపం ఇల్లాలు అంటారు పెద్దలు. ఇంట్లో ఇల్లాలు ఆరోగ్యం, ఆనందంగా ఉంటే ఇల్లంతా చక్కగా ఉంటుంది. అయితే పురుషుల కంటే, స్త్రీలు కాస్త బలహీనంగా ఉంటారు కానీ, మెమొరీ పవర్ లో చూసుకుంటే పురుషులకంటే స్త్రీలే చాలా చురుకుగా ఉంటారు. కాని స్త్రీలలో ప్రతి నెలా వచ్చే నెలసరి వల్ల కాస్త బలహీనంగా తయారవుతారు. వీటికి తోడుగా కుటుంబ బాధ్యతలు, ఆటుపోట్లు, పిల్లల కోసం పడే పాట్లు మహిళలను కాస్త ఇబ్బందులు పెడుతుంటాయి.

ఇవే కాకుండా స్త్రీలు కొంతమంది భర్తల వల్ల కూడా అనారోగ్యానికి గురవుతారని తాజాగా వచ్చిన ఒక సర్వే తెలియజేసింది. అదెలా అంటే.. కొంతమంది భర్తలు మద్యానికి బానిసై కుటుంబ బాధ్యతలు పట్టించుకోకపోవడం వల్ల, భార్యలు ఆవేదన చెంది ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఈ క్రమంలో పిల్లల కోసం ఉద్యోగంలో చేరడం, అలాగే ఇంట్లో పని చేయడం, ఇలా రకరకాల ఇబ్బందుల వల్ల వీరికి ఈ అనారోగ్యం వస్తుంది. అలాగే కొంతమంది భర్తలు మాత్రం ఎలాంటి తప్పులు చేయకపోయినా భార్యను అనుమానించడం వేధించడం లాంటివి చేస్తారు.

if husband does mistakes then wife will get sick

అలా చేయడం వల్ల కూడా భార్యలు ఒత్తిడికిలోనై అనారోగ్యానికి గురవుతారు. అలాగే కొంతమంది భర్తల వల్ల మానసికంగా, శారీరకంగా కుంగిపోయి చిన్న వయసులోనే బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడతారట. కాబట్టి భర్త ఎప్పుడైనా సరే కాస్త సమయం దొరికితే భార్యతో మంచిగా మాట్లాడటం, ఆమె పనుల్లో సహాయం చేయడం, చెడు అలవాట్లు మానుకొని చక్కగా ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు.

Admin

Recent Posts