mythology

ప‌ర‌శురాముడి గురించి చాలా మందికి తెలియ‌ని నిజాలు ఇవి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పరశురాముడి గురించి తక్కువగా తెలిసిన నిజాలు&comma; పరశురాముడి గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరమున్న విషయాలు&comma; మీరు పరశురాముడి గురించి తెలుసుకోవాలనుకున్న నిజాలు&comma; పరశురాముడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నవి ఏమిటి&period; విష్ణు మూర్తి ఆరవ అవతారమే పరశురాముడు&comma; ఇతను బ్రాహ్మణ సప్తరిషి జమదగ్ని ఆయన భార్య రేణుక కు పుట్టాడు&period; త్రేతాయుగంలో జన్మించిన ఈయన హిందూమతంలో ప్రసిద్ది పొందిన ఏడుగురు అమరవీరులలో ఒకడు&period; ఈన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ&comma; క్షత్రియుల దూకుడు&comma; ధైర్యం కలిగినవాడు&comma; అందుకే ఈయ‌నకి బ్రాహ్మ-క్షత్రియ అనే పేరు వచ్చింది&period; ఇతను యుద్ధ తంత్రంలో అద్భుతమైన నైపుణ్యం కలవాడు&comma; ఇతను 21 సార్లు భూమిమీద ఉన్న అవినీతి యోధులను వంటరిగా మట్టికరిపించాడు&period; పరశు అంటే గొడ్డలి అని అర్ధం&comma; ఈ విధంగా గొడ్డలి మోసే రాముడులా పరశురాముడి పేరును అనువదించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరశురాముడు ఒక్కరిని కూడా వదలి పెట్టకుండా తన దరికి అడ్డువచ్చిన ప్రతి ఒక్క క్షత్రియుడిని చంపడానికి సిద్ధమయ్యే వాడని పురాణాలు చెప్తున్నాయి&period; ఈ కారణం వల్ల మిగిలిన బ్రాహ్మణులు అతన్ని త్యజించారు&period; అతను ఋషుల కోసం జీవనశైలి నిబంధనలను అతిక్రమించి హత్యలు చేసినందుకు అపకీర్తిని పొందాడు&period; పరశురాముని గురించి మనకు తెలీని ఎన్నో నిజాలు ఇప్పటికీ హిందూ పురాణాలలో దాగి ఉన్నాయి&period; పరశురాముని గురించి కొద్దిపాటి నిజాలను కొన్నిటిని చదివి తెలుసుకోండి&period; రేణుకా తీర్ధం పరశురాముని జన్మస్థలంగా చెప్పబడింది&period; ఇది కూడా ఆధునిక కాల మహేశ్వర్ వంశ పరంపరలో జరిగిందని అనుకుంటున్నారు&period; ఇతని తండ్రి అయిన à°°à°¿à°·à°¿ జమదగ్ని బ్రహ్మదేవుడి కి వారసుడు&period; ఇతను పుట్టక ముందు&comma; ఇతని తల్లిదండ్రులు శివుడి ఆశీర్వాదం కోసం ప్రార్ధన చేసారు&period; దీని ఫలితమే వీరికి కలిగిన ఐదవ సంతానం విష్ణుమూర్తి ఆరవ అరవతరం గా జన్మించడానికి దారితీసింది&comma; అతనికే పుట్టుకతో రామభద్రుడు అని పేరుపెట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91761 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;parashurama&period;jpg" alt&equals;"do you know these facts about parashurama " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతి చిన్న వయసులోనే పరశురాముడికి ఆయుధాలలో ఆస‌క్తి ఎక్కువగా ఉండేది&period; అతను శివుడిని మెప్పించడానికి తీవ్రమైన తపస్సు చేసాడు&comma; చివరికి ఖగోళ గొడ్డలిని వరంగా పొందాడు&period; అయితే&comma; తన ఆధ్యాత్మిక గురువు శివుడని తెలుసుకుని&comma; ఎంతో శక్తిమంతుడని నిరూపించుకున్న తరువాతే ఈ ఆయుధం ఇవ్వడం జరిగి&comma; అతను పరశురాముడు అని పిలవబడ్డాడు&period; శివుడు పరశురాముడి యుద్ధ నైపుణ్యాలను పరీక్షించడానికి ఒక సవాలు చేసాడు&period; గురువుకి&comma; శిష్యుడికి మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం 21 రోజులు కొనసాగింది&period; యుద్ధ సమయంలో&comma; పరశురాముడు శివుని త్రిశూలం నుండి తప్పించుకుంటూ&comma; శివుడి నుదుటిపై తన గొడ్డలిని తగిలించాడు&period; ఇది చూసి శివుడు&comma; శిష్యుడు యుద్ధ కళలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడని చాలా సంతోషించాడు&period; అతను గాయాన్ని స్వీకరించి&comma; తన క్రమశిక్షణ కీర్తి శాశ్వతమైనదని నిరూపించుకున్నాడు&comma; అప్పటి నుండి అతను ఖండ-పరశుగా పిలవబడ్డాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరశురాముడి తల్లి రేణుక ఎంతో అంకితభావం కల భార్య&comma; ఆమె నమ్మకం యొక్క శక్తికి తార్కాణం&period; పాపం&comma; ఒకరోజు కుండతో నీళ్ళు నింపుతుంటే&comma; ఆకాశాన గాంధర్వ రధం ప్రయాణిస్తుంటే చూసి ఒక్క క్షణం కోరికలకు లోనైంది&period; దాని ఫలితంగా&comma; ఆ కుండ నీటిలో కరిగిపోయింది&period; తన యోగ శక్తుల ద్వారా తన భర్త ఈ విషయాన్నీ తెలుసుకుని&comma; ఎంతో ఆవేశంతో ఆమెను గొడ్డలితో చంపమని తన కుమారునికి చెప్పాడు&period; పరశురాముడు మినహా ఈపని ఎవరూ చేయలేరు&period; అతను తన తండ్రి చెప్పినట్లు తల్లిని&comma; నలుగురు అన్నలను నరికేసాడు&period; తరువాత&comma; తండ్రి అతడిని రెండు వరాలు కోరుకోమన్నాడు&comma; అపుడు అతను తన తల్లిని&comma; అన్నలను బ్రతికించమని కోరాడు&comma; తండ్రి వెంటనే అతనికి వరాలను ప్రసాదించాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts