ఆధ్యాత్మికం

వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు&period; ఈ క్రమంలోనే శ్రీహరిని తులసి మాలతో పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు&period; అయితే ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించరు&period; అంత పవిత్రమైన మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు గంగానది తీరంలో కూర్చుని తపస్సు చేస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి వినాయకుడిని చూసి&comma; ఇష్టపడి తనని వివాహం చేసుకోవాలని కోరుతుంది&period; అయితే ఆమె ఇష్టాన్ని వినాయకుడు కాదంటాడు&period;పెళ్లి చేసుకోవడం వల్ల తన తపస్సుకు భంగం కలుగుతుందని భావించిన వినాయకుడు ఆమెతో పెళ్లికి నిరాకరిస్తాడు&period; తనతో వివాహం కాదన్నందుకు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మధ్వజ యువరాణి వినాయకుడికి ఇష్టం లేని బలవంతమైన పెళ్లి జరుగుతుందని శాపం పెడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64682 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-ganesha-6&period;jpg" alt&equals;"why tulsi not used in lord ganesha pooja " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా తనకు శాపం పెట్టడంతో ఆగ్రహం చెందిన వినాయకుడు ధర్మ ధ్వజ యువరాణి పెళ్లి ఒక రాక్షసుడితో జరుగుతుందని శాపం పెడతాడు&period; వినాయకుడు శాపానికి ఎంతో చింతించిన యువరాణి తనకు శాపవిమోచనం కల్పించాలని కోరుతుంది&period; ఈ క్రమంలోనే శాంతించిన వినాయకుడు రాక్షసుడి చెంత కొంతకాలం పాటు జీవించి మరణించిన అనంతరం తిరిగి ఒక పవిత్రమైన తులసి మొక్కగా జన్మిస్తావు అంటూ ఆమెకు వరమిస్తాడు&period; అయితే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా వినాయకుడి పూజలో తులసిని ఉపయోగించరు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts