ఆధ్యాత్మికం

స్త్రీలు వీటిని త‌ప్ప‌క పాటించాలి.. ఎందుకంటే..?

ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడడం సహజం. సమస్యలు లేకుండా ఎవరూ కూడా ఉండరు. అయితే మహిళలు మాత్రం వీటిని కచ్చితంగా అనుసరించాలి. ఇవి చాలా ముఖ్యమైనవి. స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసుకుంటే, దిష్టి మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే అరికాలిలో కాటుకని కానీ ఒక చుక్క కొబ్బరి నూనెను కానీ రాసుకుంటే, దిష్టి మొత్తం పోతుంది.

బయటకు వెళ్లేటప్పుడు ఛాతి మీద చిన్న కాటుక ఎవరికీ కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. తల స్నానం చేసిన తర్వాత ఒక్కసారైనా తల వెంట్రుకల కి సాంబ్రాణి వేసుకోవాలి. ఎందుకంటే ఆడవాళ్ళపై పడే చెడు దృష్టి అంతా కూడా వెంట్రుకలని అంటి పెట్టుకొని ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత 21సార్లు గం గణపతి వాస్తవం అని తలుచుకుని నిద్ర లేవాలి. రాత్రిపూట హనుమాన్ చాలీసా కానీ, 11 సార్లు ఓం నమశ్శివాయ అని కానీ అనుకుని నిద్రపోతే మంచిది.

women must follow these know what

అష్టమి, అమావాస్య, ఆదివారం రోజుల్లో కచ్చితంగా దుర్గా స్తోత్రం చదువుకోండి. దుర్గాదేవి ఆలయానికి వెళ్లడం, భైరవుడిని తలుచుకోవడం వంటివి చేస్తే కూడా చాలా మంచిది. ఇంటి విషయాలని గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలను చెప్పుకోకూడదు. అదే విధంగా పరిచయం లేని వాళ్ళని సహాయం అడగకూడదు.

తలకి నూనె పెట్టుకోవడం లేకపోతే తలకి నూనె పెట్టుకోకపోతే కనీసం ఒక చుక్క నూనె ని తల మీద పెట్టుకోండి. పండగ రోజుల్లో కానీ సెలవు రోజుల్లో కానీ శుక్రవారం నాడు కానీ పాదాలకి పసుపు రాసుకోండి. ఎవరి దృష్టి పడకూడదు అంటే మంగళవారం నాడు మొహానికి పసుపు రాసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి దాపరికాలు కూడా అస్సలు పనికిరావు. మొండి ధైర్యం, మొదటికే మోసం, అతి చనువు ఎప్పటికీ ప్రమాదం. నిత్యం దీపారాధన చెయ్యాలి. అమంగళం పలకకూడదు.

Share
Admin

Recent Posts