హెల్త్ టిప్స్

Tongue Spots : నాలుక మీద మచ్చలు ఉంటే.. ఏది చెబితే అది అయిపోతుందా..?

Tongue Spots : కొంత మంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక‌ మీద మచ్చలు ఉండేవారు ఏది అంటే అది జరిగిపోతుందా..? సినిమాల్లో కానీ పెద్దలు చెప్పడం కానీ మీరు వినే ఉంటారు. నాలుక‌ మీద మచ్చలు ఉంటే, వారు చెప్పేదంతా నిజమైపోతుందని అంటూ ఉంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, వాక్ పటిమ, వాక్ సిద్ధి ఉంటుందని.. వారు అన్నవి కానీ, వారు చెప్పినవి కానీ జరుగుతాయని అంటారు. నాలుక మీద ఉండే పుట్టు మచ్చలకు ప్రాముఖ్యత ఏంటనేది చూస్తే.. సరస్వతీ దేవి ఉపాసన తరతరాల్లో బాగా చేసి వున్నా, సరస్వతి దేవి కటాక్షం వున్నా.. వారి నాలుక మీద అమ్మవారు ఐం అనే బీజాక్షరం రాసి ఉంటుందట. అదే పుట్టు మచ్చగా కనబడుతుంది అని పెద్దలు అంటారు. అయితే ఇందులో రెండు రకాలు. ఒకటి చెడు ఎక్కువగా మాట్లాడే వారు. చెడుకు సంబంధించినవి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవి జరుగుతుంటాయి. వీరికి ఎక్కువ గౌరవం లభించదు.

what happens if tongue have black spots

దైవానుగ్రహం కనుక ఇంకా పెరగాలంటే మంచే మాట్లాడాలి. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం వాక్ సిద్ధి నాలుకపై ఐం రాయడం వలన వస్తుంది. అయితే అలా వున్న వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా, అబద్ధాలు పలకకుండా కేవలం ఎవ‌రు అయితే సత్యాన్ని మాట్లాడతారో వారికే మంచి జరుగుతుంది. ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా మాట్లాడితే వారికి అమ్మవారి కటాక్షం లభిస్తుంది. దైవనుగ్రహం కూడా బాగా పెరుగుతుంది. కానీ అదే ప‌నిగా అబద్దాలు చెబుతూ వుండే వాళ్లకి మాత్రం ఆ శక్తి ఉండదు. వీరికి ఎక్కువ గౌరవం ఉండదు.

Share
Admin

Recent Posts