వెన్ను నొప్పి

వెన్ను నొప్పి బాగా ఉందా ? త‌గ్గించుకునేందుకు ఈ అద్భుత‌మైన చిట్కాల‌ను పాటించండి..!

వెన్ను నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందిలో వ‌స్తుంటుంది. రోజూ శారీర‌క శ్ర‌మ ఎక్కువగా చేసేవారికి, ద్విచక్ర వాహ‌నాలపై రోజూ ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారికి, రోజూ ఎక్కువ‌గా నిల‌బ‌డి ఉండేవారికి, కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌ని చేసేవారికి.. వెన్ను నొప్పి ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

follow these home remedies for back pain

1. యూక‌లిప్ట‌స్ ఆయిల్ (నీల‌గిరి తైలం)తో వెన్నుపై బాగా మ‌ర్ద‌నా చేయ‌డం వ‌ల్ల వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

2. యూక‌లిప్ట‌స్ ఆయిల్ లేక‌పోతే అందుకు బ‌దులుగా బాదం నూనె, నువ్వుల నూనె లేదా ఆవ‌నూనె వాడ‌వ‌చ్చు. అయితే వీటిని కొద్దిగా వేడి చేసి వెన్నుపై రాయాలి. బాగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

3. క‌ర్పూరం, కొబ్బ‌రినూనెల‌ను సమాన భాగాల్లో తీసుకుని బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని 5-10 నిమిషాల పాటు మ‌రిగించాలి. అనంత‌రం చ‌ల్లార్చి ఆ మిశ్ర‌మాన్ని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. దాన్ని వారంలో రెండు సార్లు ఉప‌యోగించాలి. రాత్రి నిద్ర‌కు ముందు ఈ మిశ్ర‌మంతో వెన్నుపై మ‌ర్ద‌నా చేయాలి. దీని వ‌ల్ల ఆ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

4. ఆవ‌నూనెను కొద్దిగా వేడి చేసి దాంతో వెన్నుపై మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత వేడి నీళ్ల‌తో స్నానం చేయాలి. ఇలా చేసినా స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. నువ్వుల నూనె లేదా ఆవ‌నూనెను తీసుకుని అందులో కొద్దిగా కొబ్బ‌రినూనె క‌లిపి స‌న్న‌ని మంట‌పై వేడి చేయాలి. అందులో 8-10 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను వేసి మ‌రిగించాలి. వెల్లుల్లి రెబ్బ‌లు బ్రౌన్ క‌ల‌ర్‌లోకి మార‌గానే ఆ నూనెను కింద‌కు దించి వ‌డ‌క‌ట్టాలి. ఆ మిశ్ర‌మాన్ని వెన్నుపై రాసి మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

6. రెండు టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల ప‌సుపుల‌ను తీసుకుని బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. 5 నుంచి 8 నిమిషాల పాటు మ‌ర్ద‌నా చేయాలి. ఇలా 1-2 వారాలు చేస్తే వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

7. క‌ల‌బంద గుజ్జుతో వెన్నుపై మ‌ర్ద‌నా చేస్తుంటే వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

8. రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపు క‌లుపుకుని తాగ‌వ‌చ్చు.

9. అల్లం ముక్క‌ల‌ను నీటిలో వేసి మ‌రిగించిన మిశ్ర‌మాన్ని తాగుతుండాలి. నొప్పి త‌గ్గుతుంది.

10. తుల‌సి ఆకుల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ మిశ్ర‌మాన్ని తాగుతుండాలి. దీని వ‌ల్ల కూడా వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

Admin
Published by
Admin

Recent Posts