మనకు లభించే ఎన్నో రకాల అద్భుతమైన పండ్లలో అరటి పండ్లు ఒకటి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. అరటి పండ్లలో ఫైబర్, విటమిన్లు సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువల్ల మనకు లాభాలు కలుగుతాయి. అయితే అరటి పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వీటిని అధిక మోతాదులో తీసుకోరాదు. తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం అరటి పండ్లను రోజుకు 2 లేదా 3 తినవచ్చు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు 3 అరటి పండ్లను తినవచ్చు. కానీ అంతకు మించి తినరాదు. ఎందుకంటే.. అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల అందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను కలగజేస్తుంది. అజీర్ణం, మలబద్దకం వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
అరటి పండ్లను అధికంగా తింటే శరీరంలో పోషకాలు అసమతుల్యం అవుతాయి. అంటే మనం తినే ఇతర ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు.
అరటి పండ్లను అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గాలని చూసేవారికి ఇది మంచిది కాదు.
అరటి పండ్లలో ట్రిప్టోఫాన్ అధికంగా ఉంటుంది. ఇది నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. అందువల్ల అతిగా అరటి పండ్లను తింటే నిద్ర బాగా వస్తుంది.
అరటి పండ్లను ఎక్కువగా తినడం వల్ల దంతాలపై ప్రభావం పడుతుంది. దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బ తినేందుకు అవకాశం ఉంటుంది.
కనుక అరటి పండ్లను రోజుకు 2 లేదా 3 మాత్రమే తినాలి. అంతకు మించి తింటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.