వినోదం

Emira Ali : అబ్బాస్ కుమార్తెను చూశారా.. హీరోయిన్ల‌ను మించి అందంగా ఉంది..!

Emira Ali : సినిమా ఇండ‌స్ట్రీలో చాన్స్‌లు రావ‌డ‌మే క‌ష్టం. వ‌చ్చిన త‌రువాత నిలుపుకోవాలి. న‌టులుగా నిరూపించుకోవాలి. అలాగే ల‌క్ కూడా ఉండాలి. దీంతో హీరోలు, హీరోయిన్లుగా రాణిస్తారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌టి లేదా రెండు సినిమాలు చేసి తెర‌మ‌రుగు అయ్యారు. కొంద‌రు మాత్రం కొంత‌కాలం రాణించి ఆ త‌రువాత ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు. అలాంటి వారు ఇండ‌స్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఒక‌ప్పుడు స్టార్లుగా రాణించారు. కానీ ఇప్పుడు వారు అస‌లు చూద్దామ‌న్నా క‌నిపించ‌డం లేదు. అలాంటి వారిలో న‌టుడు అబ్బాస్ కూడా ఒక‌రు.

అబ్బాస్ అప్పట్లో అమ్మాయిల రాకుమారుడిలా ఉండేవాడు. ఆయ‌న అప్పట్లో లవర్ బాయ్ గా బాగా ఇమేజ్ సంపాదించుకున్నారు. సినిమా ప్రేక్షకులు హీరో అబ్బాస్ ను లవర్ బాయ్, హ్యాండ్ సమ్ అంటూ ప్రశంసించేవారు. వెస్ట్ బెంగాల్ లో పుట్టి పెరిగిన అబ్బాస్ తమిళ్ లో హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తెలుగులో అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మోడలింగ్ రంగంలో తన కెరీర్ స్టార్ట్ చేసిన అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ క్రేజ్ ను, ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.

abbas daughter emira ali photos viral

ఆ సినిమా హిట్ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకొని లవర్ బాయ్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపుగా 60 సినిమాలలో నటించిన అబ్బాస్ తమిళ్ లో ఎక్కువ సినిమాలలో నటించారు. అబ్బాస్ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయ‌న‌ సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసిన ఇరుం అలీని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హీరోగా సినిమాలు తగ్గించేసినప్పటికీ అబ్బాస్ పలు కమర్షియల్ యాడ్స్ లో నటించాడు.

అబ్బాస్ ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అబ్బాస్,ఇరుం అలీ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. అబ్బాస్ లాగానే అతని భార్య, పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు. అబ్బాస్ కూతురు ఎమిరా అలీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ల అందాన్ని కూడా మైమరపించేలా ఉన్న ఎమిరా ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Admin

Recent Posts