వినోదం

తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత దురదృష్టవంతులైన నటీనటులు ఎవరు?

రంగనాధ్ ఆజానుభావుడు, స్ఫురధ్రూపి మరియు చక్కటి గొంతుతో , అద్భుతమైన వాచకంతో డైలాగులు చెప్పేవాడు. అయినా హీరోగా కొన్ని రోజులే మురిపించాడు. దురదృష్టం వెంటాడి, అవకాశాలు రాక ఖైదీ చిత్రంతో (1983) సహాయ పాత్రలు వేయడం అది కొన్ని రోజుల వైభవమే. భార్య ఆక్సిడెంట్ తో ఆమెని చూసుకోవడానికి ఇంటికి పరిమితం కావడంతో మరుగున పడ్డాడు. తిరిగి కొన్నిరోజులకి రంగ ప్రవేశం చేసినా తెలుగు చిత్ర పరిశ్రమ అరకొర పొత్రలకే పరిమితం చేసింది.

ఆయ‌న ప్రతిభకి తగ్గ గుర్తింపు లేని పాత్రలే చివరి వరకు పోషించాడు. అతని జీవితంలో ఒడిదుడుకులు దురదృష్టం. అతని సినీజీవితానికి ప్రతిబంధకమై అతనికి ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావల్సిన గుర్తింపు రాకుండా చేసాయని చెప్పవచ్చు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి స్పందిస్తూ 5నిమిషాలు తనతోమాట్లాడితే బతికే వాడు అన్న రంగనాధ్.

actor ranganath is the most unlucky person in telugu film industry

చివరికి తనే ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. వాణిశ్రీ, , లక్ష్మి లాంటి అగ్ర హీరోయిన్లతో నటించినప్పటికి ఎందుకో వెనుకబడి కనుమరుగయ్యాడు. కారెక్టర్ ఆర్టిస్టుగా గొప్పగా నటించినప్పటికి ఎందుకో ఏనాడు గొప్ప ఊపులో కనిపించలేదు‌. తెలుగు చిత్రపరిశ్రమ అతని ప్రతిభని సరిగా వినియోగించుకోలేదు.

Admin

Recent Posts