mythology

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీమహావిష్ణువే&period; శ్రీకృష్ణుడిని గోవిందుడు&comma; ముకుంద&comma; మధుసూదన&comma; వాసుదేవుని పేర్లతో పిలుస్తారు&period; భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు&period; వారు రుక్మిణి &comma; సత్యభామ &comma; జాంబవతి&comma; కాళింది&comma; మిత్రవింద&comma; నగ్నజీతి&comma; భద్ర&comma; లక్ష్మణ&period; అలాగే తనను భక్తితో ఆరాధించే 16 వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు&period; అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ&period; వారిలో ఒకరు తన పట్టమహిషి రుక్మిణి&comma; ఇంకొకరు సత్యభామ&period; అయితే ఈ ఇద్దరు రాణులు వాసుదేవుడికి భార్యలుగా రావడం వెనుక ఓ పెద్ద కథే ఉంది&period; రుక్మిణి విదర్భ రాజు భీష్మకుని కుమార్తె&period; కృష్ణుడు తన భర్తగా రావాలని చిన్ననాటి నుంచే రుక్మిణి కోరుకుంది&period; తన శ్వాస&comma; నిశ్వాసల్లోనూ నిరంతం కృష్ణుని ధ్యానంలో గడిపింది&period; అయితే ఈ విషయం ఆమె సోదరుడు రుక్మికి ఇష్టం లేదు&period; రుక్మిణిని తన స్నేహితుడైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని భావించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శిశుపాలుడు&comma; జరాసంధుడికి శ్రీకృష్ణుడు ఆగర్భ శత్రువు అందుకే రుక్మి వ్యతిరేకించేవాడు&period; గోవిందుడే తన భర్తగా కోరుకున్న రుక్మిణి ఆ స్థానంలో ఎవరినీ ఊహించడానికి సాహసం చేయలేదు&period; తన అన్న రుక్మి బలవంతంగా శిశుపాలునితో వివాహం జరిపించాలని భావిస్తున్నాడని&comma; కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటూ కృష్ణుడికి రుక్మిణి సందేశం పంపింది&period; అలాగే తాను ఆలయంలో ఎదురుచూస్తూ ఉంటానని తెలియజేసింది&period; సందేశం అందుకున్న వాసుదేవుడు తాను రక్షిస్తానని అభయం ఇచ్చాడు&period; మందిరంలో గోవిందుడి రాకకోసం రుక్మిణి ఎదురుచూస్తూ పార్వతిని ప్రార్థిస్తూ గడిపింది&period; కృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి విదర్భ చేరుకుని రుక్మిణిని అక్కడ నుంచి ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు&period; రుక్మిణి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ అవతారం&period; ఆమె ఎప్పుడూ నారాయణుడి హృద‌à°¯‌ మందిరంలో కొలువుంటుంది&period; అందుకే రుక్మిణి అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం&period; భూలోకంలో శ్రీహరి అవతరించిన ప్రతి సందర్భంలోనూ లక్ష్మీదేవి అనుసరిస్తూ ఉండేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90306 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-srikrishna&period;jpg" alt&equals;"why lord sri krishna likes rukmini and satyabhama very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్వారక కోశాధికారి సత్రాజిత్తు కుమార్తె సత్యభామ&period; సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి రోజుకు వేయి బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణిని వరంగా పొందాడు&period; శమంతకమణిని ఒకసారి తనకు ఇవ్వమని కృష్ణుడు అడుగుతాడు&period; అందుకు సత్రాజిత్తు నిరాకరిస్తాడు&period; అతని సోదరుడు ప్రసేనుడు దీన్ని ధరించి వేటకు వెళతాడు&period; అడవిలో వేటకు వెళ్లిన ప్రసేనుడిని ఓ సింహం దాడి చేసి హతమార్చుతుంది&period; అదే సమయంలో జాంబవంతుడు సింహాంతో పోరాడి శమంతకమణిని తీసుకుపోయి తన కుమార్తె జాంబవతికి ఇస్తాడు&period; కృష్ణుడే తన సోదరుడిని సంహరించి ఆ మణిని తీసుకుపోయాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు&period; తనపై వచ్చిన నిందను తొలగించుకోడానికి కృష్ణుడు ఆ మణిని వెదుకుతూ అడవికి బయలుదేరుతాడు&period; జాంబవంతుడి దగ్గర ఉన్నట్లు గుర్తించి&comma; అతడు ఉండే గుహకు వెళతాడు&period; అక్కడ జాంబవంతుడితో 28 రోజులు భీకర యుద్ధం చేస్తాడు&period; తనతో యుద్ధం చేస్తున్నది శ్రీమన్నారాయణుడిగా గుర్తించిన జాంబవంతుడు మణితోపాటు తన కుమార్తె జాంబవతిని ఇచ్చి వివాహం జరిపించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు అప్పగించడంతో ఆయన తన తప్పును తెలుసుకుని కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు&period; సత్యభామ గత జన్మలో చంద్రకాంత అనే నాగకన్య&period; ఈమె గొప్ప విష్ణు భక్తురాలు&period; అంతే కాదు ఆయనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది&period; అమె అందానికి మోహితుడైన మైరావణుడు తన స్థావరంలో బంధిస్తాడు&period; త్రేతాయుగంలో రాముడిగా అవతరించిన శ్రీహరి మహిరావణుడి రాజ్యంలో బందీగా ఉన్న ఆమెను కలుసుకుంటాడు&period; తాను ఈ జన్మలో ఏకపత్నీ వ్రతుడనని&comma; వచ్చే జన్మలో వివాహం చేసుకుని&comma; తన రాజ్యానికి రెండో రాణిగా చేస్తానని వాగ్దానం చేశాడు&period; అందుకే ద్వాపర యుగంలో సత్యభామగా జన్మించిన చంద్రకాంతను కృష్ణుడు పరిణయమాడాడు&period; అలాగే పురాణాల ప్రకారం సత్యభామను భూదేవి అవతారంగా పేర్కొంటారు&period; లక్ష్మీ&comma; భూదేవి అంశంతో జన్మించిన రుక్మిణి&comma; సత్యభామలంటే గోవర్దన గిరిధారికి అందుకే అంత ఇష్టం&period; నరకాసుర సంహారంలోనూ సత్యభామ పాత్ర కీలకం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts