తెలుగు ఇండస్ట్రీ లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరుపొందిన ఎస్.ఎస్.రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ దేశాలు గుర్తుంచుకునే విధంగా నలుదిక్కుల తెలుగు సినిమా ఖ్యాతిని చూపించిన డైరెక్టర్ జక్కన్న. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ఎంతో మంది హీరోలను స్టార్ హీరో లుగా మార్చిన ఘనత జక్కన్న కే చెందుతుంది. ఆయన డైరెక్ట్ చేసి హిట్టయిన సినిమా తర్వాత, చేసే ప్రతి సినిమా ఫ్లాప్ గా నిలిచాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ఎన్టీఆర్:
స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో మొదలైన రాజమౌళి ప్రస్థానం అలాగే ఎన్టీఆర్ కు ఫస్ట్ టైం సూపర్ హిట్ సినిమా అందించారు. దీని తర్వాత వచ్చిన ఎన్టీఆర్ మూవీ సుబ్బు డిజాస్టర్ గా నిలిచింది.
నితిన్ :
2004లో రాజమౌళి డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన సినిమా “సై”, ఆర్ట్స్,సైన్స్ గ్రూప్ స్టూడెంట్స్ మధ్య వచ్చిన వార్ కథతో సినిమా బాగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా తర్వాత నితిన్ “అల్లరి బుల్లోడు” తీవ్రంగా ఫ్లాప్ అయింది.
ప్రభాస్ :
2005 చత్రపతి సినిమా రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చింది. సూపర్ హిట్ అయింది. ఇక ప్రభాస్ కు తిరుగులేదనికునే సమయంలోనే పౌర్ణమి సినిమా వచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
రవితేజ :
2006లో మళ్లీ విక్రమార్కుడు రవితేజ హీరోగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, అలాగే దొంగ క్యారెక్టర్లో ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తర్వాత వచ్చిన ఖతర్నాక్ సినిమా మాత్రం తీవ్రంగా డిజాస్టర్ అయింది.
రామ్ చరణ్ :
2009లో జక్కన్న డైరెక్షన్ లో మగధీర సినిమా లవ్ అండ్ యాక్షన్ సీన్స్ తో చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మళ్లీ 2010 లో ఆరెంజ్ వచ్చింది. స్టోరీ అంతా తికమక ఉండడంతో తీవ్రంగా ప్లాప్ అయింది.
నాని :
2012 ఈగ మూవీతో మన ముందుకు వచ్చారు జక్కన్న. అందరూ ఆశ్చర్యపోయారట ఈగ తో సినిమా ఏంటని. కానీ ఈ సినిమా చూస్తే అందరూ షాక్ అయ్యారు. ఈగ తీర్చుకునే రివేంజ్ కథతో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీని తర్వాత “ఎటో వెళ్ళిపోయింది మనసు” నాని ఖాతాలో మరో డిజాస్టర్ పడింది.
ప్రభాస్:
ప్రభాస్ హీరోగా బాహుబలి పాన్ ఇండియా సినిమా గా రాజమౌళి డైరెక్షన్లో వచ్చింది. చిన్న పిల్లాడి నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ సినిమా గురించే మాట్లాడారు అంటే ఈ సినిమా ఎంతటి ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత ప్రభాస్ సాహో వచ్చింది. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా బోల్తా పడింది.
రామ్ చరణ్:
2022 లో ఆర్ ఆర్ ఆర్ ఏపిక్ డ్రామా, యాక్షన్, ఫ్రెండ్షిప్,అనే అన్ని కోణాలను చూపిస్తూ వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్ తో ఇద్దరు స్టార్ హీరోలను ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ విధంగా తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు రాజమౌళి. దీని తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య అంతగా కనెక్ట్ కాలేకపోయింది.