వినోదం

Actress Jayalalitha : త‌ప్ప‌ని ప‌రిస్థితుల‌లో కొందరు మ‌గాళ్ల‌కి లొంగిపోవాల్సి వ‌చ్చింది అంటూ జ‌య‌ల‌లిత సంచ‌ల‌న‌ కామెంట్స్

Actress Jayalalitha : క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయ లలిత. పాత తరం వాళ్లకు బోరింగ్ పాపగా.. టీవీ ప్రేక్షకులకు దుర్గమ్మ (గోరంత దీపం)గా గుర్తిండిపోతుంది. తెలుగుతో పాటు కన్నడ,మలయాళ, హిందీ చిత్రాల్లో నటించింది. 1986 నుండి ఇప్పటి వరకు పరిశ్రమలోనే కొనసాగుతున్న జయలలిత.. బాలకృష్ణ లారీ డ్రైవర్ చిత్రంలో.. బోరింగ్ పంప్ ఓనర్‌ ‘బోరింగ్ పాప’గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. జయలలిత కన్నా ఈ పేరుతోనే అప్పట్లో ఫేమస్ అయ్యింది ఈ నటి. లేడీ విలన్‌గా, గ్లామరస్ పాత్రలో మెప్పించిన ఆమె.. మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. లవ్ మ్యారేజ్ చేసుకుని.. అతడి టార్చర్ తట్టుకోలేక పెళ్లైన కొన్నాళ్లకే భర్త నుండి విడిపోయింది.

తాజాగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తాను హైదరాబాద్ కు వచ్చానని… వరుసగా సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఇక్కడే ఉండిపోయానని జయలలిత చెప్పారు. తాను ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేశానని…. ఒక రోజు డైరెక్టర్ గదికి రమ్మని పిలిచాడని, లేదంటే సినిమా నుంచి తీసేస్తానని హెచ్చరించాడని తెలిపారు. తాను ఒప్పుకోకపోవడంతో తనను సినిమా నుంచి తీసేశారని చెప్పారు. ఆ తర్వాత కూడా కొందరు తన వెంట పడేవారని… కొన్నిసార్లు తప్పించుకునే దాన్నని, కొన్ని సార్లు తప్పని పరిస్థితుల్లో లొంగిపోయేదాన్నని జయలలిత షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

Actress Jayalalitha told about her film career

తాను చెడిపోయినా పర్వాలేదని, ఇంట్లో వాళ్లు బాగుండాలనే అలా చేశానని చెప్పారు. అయితే, అందరూ వాళ్ల అవసరాలు తీర్చుకున్నారే కానీ, తన మీద ప్రేమను చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ బాబు, తాను ప్రేమించుకున్నామని… పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని జయలలిత తెలిపారు. ఆయనను తాను బావ అని పిలిచేదాన్నని చెప్పారు. బిడ్డను కనాలని ప్లాన్ కూడా చేసుకున్నామని తెలిపారు. అయితే, తమ పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఆపేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని… ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేరు కాబట్టే చెపుతున్నానని అన్నారు.

Admin

Recent Posts