వినోదం

Maheshwari : మ‌హేశ్వ‌రి కోసం అప్ప‌ట్లో ఆ ద‌ర్శ‌కుడు, హీరో గొడ‌వ‌లు ప‌డ్డారా..?

Maheshwari : తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమాలో నటించిన మహేశ్వరి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. ఈ సినిమాలో జేడీ చక్ర‌వ‌ర్తి హీరోగా నటించాడు. ఈ సినిమా సమయంలో మహేశ్వరి ప్రేమ కోసం హీరో జేడీ చ‌క్ర‌వ‌ర్తి, ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ చాలా గొడవలు పడ్డారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కొన్ని మంచి సినిమాల్లో నటించిన మహేశ్వరి స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.

పరిశ్రమలో శ్రీదేవి అక్క కూతురిగా బాగా పాపులర్ అయింది. శ్రీదేవి మహేశ్వరికి ఎంత సాయం చేయాలో అంత సాయం చేసింది. మహేశ్వరి ఫ్లాప్స్ లో ఉన్నపుడు కూడా సాయం చేసింది. శ్రీదేవి త‌ల్లి రాజేశ్వ‌ర‌మ్మకు ముందు భ‌ర్త రంగారావు ద్వారా పుట్టిన సూర్య‌క‌ళ‌ కుమార్తే మ‌హేశ్వ‌రి. ఇక మహేశ్వరి సోదరుడు హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు కూడా శ్రీదేవి ప్రమోట్ చేసి తన వంతు బాధ్య‌తను నెరవేర్చింది. శ్రీదేవి పేరు చెప్పుకొని మహేశ్వరి కుటుంబం చాలా లాభపడింది. అయితే శ్రీదేవి చనిపోయినప్పుడు మహేశ్వరి గాని ఆమె కుటుంబ సభ్యులు గాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శ్రీదేవి చనిపోయిన తర్వాత తెలిసినవారు మహేశ్వరిని కాంటాక్ట్ అవుతున్నారు.

actress maheshwari life interesting facts

శ్రీదేవి అంటే అసలు ఇష్టం లేని సవతి కొడుకు అర్జున్ కపూర్ కూడా శ్రీదేవి చనిపోయిందనే వార్త తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ముంబై చేరుకొని చెల్లిని ఓదార్చటమే కాకూండా తండ్రికి సాయంగా ఉండటానికి దుబాయ్ కూడా వెళ్ళాడు. కానీ మహేశ్వరి జాడ ఎక్కడ కనపడలేదు. సినీ పరిశ్రమలో అప్ప‌ట్లో వినిపించిన‌ వార్తల ప్రకారం శ్రీదేవికి, మహేశ్వరి కుటుంబానికి పెద్దగా పడలేదట. ఏవో గొడవలు జరిగాయని, అందుకే ఆ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపించాయి. అయితే ఆ త‌రువాత ఏం జ‌రిగిందో తెలియ‌లేదు.

Admin

Recent Posts