వినోదం

Student No.1 : ఎన్టీఆర్‌తో స్టూడెంట్ నం.1 సినిమాను తీయ‌న‌న్న రాజ‌మౌళి.. కానీ ఎందుకు తీశారు..?

Student No.1 : నంద‌మూరి న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. రూపురేఖ‌ల‌తోనే ఎన్టీఆర్ మొద‌ట అంద‌రి దృష్టినీ త‌న‌వైపు తిప్పుకున్నాడు. చూడ్డానికి అచ్చం ఎన్టీ రామారావులా ఉండ‌టంతో ఇండ‌స్ట్రీలో ప‌క్కా రాణిస్తాడ‌ని అంతా ముందే భావించారు. ఎన్టీఆర్ నిన్ను చూడాల‌ని సినిమాతో టాలీవుడ్ కు హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. కానీ ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయ్యింది.

ఈ సినిమా త‌రువాత జ‌క్క‌న్న మొద‌టిసారి ద‌ర్శ‌క‌త్వం వహించి ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ సినిమా తీశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతోపాటు ఎన్టీఆర్ న‌ట‌న‌, డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాతోనే అటు ఎన్టీఆర్ హీరోగా స‌క్సెస్ ను అందుకోగా.. రాజ‌మౌళి కూడా ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ ను అందుకున్నాడు. అయితే ఈ సినిమాకు తెర వెన‌క ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది.

jr ntr student no 1 movie interesting facts

రాఘ‌వేంద్ర‌రావు త‌న శిష్యుడు రాజ‌మౌళికి ఎన్టీఆర్ తో స్టూడెంట్ నంబ‌ర్ 1 సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించాడు. అంతే కాకుండా రాఘ‌వేంద్ర‌రావు సినిమాకు సంబంధించిన ప‌నులును ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. అయితే మొద‌ట్లో ఎన్టీఆర్ పై రాజ‌మౌళికి మంచి అభిప్రాయం ఉండేది కాద‌ట‌. ఈ విష‌యాన్ని జ‌క్క‌న్న స్వ‌యంగా చెప్పారు. ఓ ద‌ర్శ‌కుడి వ‌ల్ల రాజ‌మౌళికి ఎన్టీఆర్ ప‌రిచ‌యం అయ్యాడ‌ట‌.

ఎన్టీఆర్ ను చూసిన‌ప్పుడు త‌న హీరో ఇలా ఉంటాడ‌ని అనుకోలేద‌ని నిరాశ చెందార‌ట‌. కానీ ఎన్టీఆర్ న‌ట‌న చూసి అవాక్క‌య్యార‌ట‌. అంతే కాకుండా ఈ సినిమా స‌మ‌యంలో ఎన్టీఆర్ తో ఫ్రెండ్షిప్ కూడా ఏర్ప‌డ‌టం వ‌ల్ల సినిమా షూటింగ్ ను కూడా ఆడుతూ పాడుతూ ఫినిష్ చేశార‌ట‌. అలా తెర‌కెక్కించిన స్టూడెంట్ నంబ‌ర్ 1 కలెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఎన్టీఆర్ ను హీరోగా, జ‌క్క‌న్నను ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టింది.

Admin

Recent Posts