వినోదం

Rambha : రంభ పెళ్లి అయిన వ్య‌క్తిని చేసుకోవ‌డం వెనక కారణం ఇదా..?

Rambha : హీరోయిన్ రంభ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది ఈ ముద్దుగుమ్మ‌. రంభ ఓ మాములు అమ్మాయి. ఏదో ఒక రకంగా సినిమా హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కాని అలాంటి అమ్మాయి వంద చిత్రాల్లో నటించింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రంభ తన అందాలతో మ‌త్తెక్కించింది. ఆ తర్వాత ఆ అందం ఉత్తరాదికి చేరి, అక్కడ ఎంతో మందికి బంధం వేసింది. నటిగా ఎంతోమందిని ఆకట్టుకున్న రంభ భర్తను మాత్రం కొంగున ముడివేసుకోలేక కొంతకాలానికే విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కింది. త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసిపోయిన ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం అత‌నితో సంతోషంగానే జీవితం గడుపుతుంది.

రంభ వైవాహిక జీవితం విషయానికి వస్తే 2010 లో ఏప్రిల్ 7 వ తారీఖున కర్ణాటక రాష్ట్రం లోని తిరుపతి కల్యాణ మండపంలో ఎన్నారై అయిన ఇంద్ర కుమార్ పద్మ నాధన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇంద్రకుమార్ పద్మనాధన్ ఎవరు అంటే కెనడాలోని ఒక ప్రముఖ వ్యాపారవేత్త. మాజిక్ హుడ్స్ అనే కంపెనీకి అధినేత.ఇంకా ఇతను రంభను కొన్ని సినిమాల్లో చూసి ఇష్టపడ్డాడట. అలా రంభను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అయితే రంభ పెళ్లైన వ్య‌క్తిని చేసుకోవడానికి గ‌ల కార‌ణం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

actress rambha marriage interesting facts to know

రంభ త్రీ రోజెస్ సినిమా కోసం తన బిల్డింగ్ తాకట్టు పెట్టి సినిమా పూర్తి చేసిందట.కానీ ఆ సినిమా వల్ల తాను న‌ష్టాలు చ‌వి చూసింద‌ట‌. ఆ స‌మ‌యంలో బిల్డింగ్ అమ్మేసి ఒక చిన్న ఇంట్లోకి తన ఫ్యామిలీతో షిఫ్ట్ అయిందట. అనంత‌రం అవకాశాలు రాకపోవడంతో ఐటెం సాంగ్స్ అలాగే బుల్లితెరపై కొన్ని షో లలో జడ్జిగా కూడా చేసిందట. రెమ్యున‌రేష‌న్ కూడా ఆమెకి సరిపోక‌పోవ‌డంతో అప్పుడు ఇంద్ర కుమార్ పద్మనాథన్ అప్పులు మొత్తం తీర్చేసి ఆమెకు కారు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడట. అప్పుడు అత‌ని ప్రేమ‌లో ప‌డి వివాహం చేసుకుంద‌ని అంటారు. ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Admin

Recent Posts