Yashasvi Jaiswal : ప్రస్తుతం ఐపీఎల్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తుంది. అయితే ఈ సీజన్ లో యువ క్రికెటర్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు యశస్వి జైస్వాల్. రాజస్తాన్ తరపున ఎక్కువ పరుగులు సాధించన ఆటగాడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు యశస్వి. ముంబైకి చెందిన యశస్వి నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. ఎంతో కష్టపడి క్రికెటర్ గా మారాడు. పానీపూరి బండి వద్ద పని చేసుకున్న యశస్వి ఇప్పుడు ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తూ అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి దూసుకు వెళ్తున్నాడు. ఆయన జోరు చూస్తుంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో పాపులర్ అవడం ఖాయంగా కనిపిస్తుంది.
అయితే ఐపీఎల్ లో తెగ సందడి చేస్తున్న జైస్వాల్ కు అభిమాన పేజీలు కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇదే సమయంలో మీమ్స్ తో కూడా జైస్వాల్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో యశస్వి యొక్క సందడి అంతా ఇంత లేదు. తాజాగా ఒక మీమ్ ఎక్కువ మంది దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకుని అందులోని బుడ్డోడు ప్రస్తుత స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అంటూ మీమ్ క్రియేట్ చేశారు. విక్రమార్కుడు సినిమాలో రేయ్ సత్తీ బాల్ ఇటు వచ్చిందా అంటూ ఒక కుర్రాడు రవితేజను పిలిచి అడగడం మనం చూసే ఉంటాం.
అయితే అప్పుడు పిల్లాడిని లోనికి తీసుకు వెళ్లి రవితేజ కొడతాడు. ఆ సన్నివేశం ఇప్పటికి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ సీన్ లో కుర్రాడు మరెవ్వరో కాదు యశస్వి జైస్వాల్ అంటూ మీమ్ లో చెబుతున్నారు. దాంతో చాలా మంది కూడా నిజమే అయ్యి ఉంటుందని అనుకున్నారు. కానీ చూడ్డానికి కాస్త పోలికలు అలాగే ఉన్నాయి కానీ విక్రమార్కుడు సినిమాలో కనిపించిన కుర్రాడు యశస్వి కాదు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.